Kadambari Jethwani: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..

అప్పటి సీపీ కాంతిరాణా టాటా తనపై తప్పుడు కేసు పెట్టారని ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు.10 నుంచి 15 మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారన్నారు. ఈ వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

Kadambari Jethwani: ముంబై నటి కేసులో సంచలనాలు.. ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి..
New Update

Kadambari Jethwani: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలనాలు బయటికొస్తున్నాయి. ఆమె లాయర్ నర్రా శ్రీనివాస్ షాకింగ్ అంశాలు బయటపెట్టారు. ఈ కేసులో ముగ్గురి పోలీసు అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అప్పటి సీపీ కాంతిరాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు.. డీసీపీ విశాల్ గున్నీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేసు పెట్టకముందే, ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్లారని.. పక్కా ప్లాన్‌తోనే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో కేసు పెట్టించారని లాయర్ నర్రా శ్రీనివాస్ తెలిపారు. సోషల్ మీడియాలో నటిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై ఏపీలో ఉన్న కేసు తప్ప ఇంకో కేసు లేదన్నారు. వేరే రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని రాస్తున్నారని.. అదంతా తప్పు అని స్పష్టం చేశారు. ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: కూతురు వరసయ్యే అమ్మాయితో.. ఆ కౌన్సిలర్ ఏం చేశాడంటే?

నిన్న విజయవాడ పోలీసులను కలిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ముంబయి నటి జెత్వానీ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే తాను విజయవాడ వచ్చినట్లు తెలిపారు. తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. నేను, నా కుటుంబ సభ్యులు ఈ విషయాల వల్ల తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కాదంబరి జెత్వానీ తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా తనను వేధించారని ఆమె వివరించారు. వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించానన్నారు.

కుక్కల విద్యాసాగర్ పై ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయని నటి కాదంబరి స్పష్టం చేశారు. విద్యాసాగర్ తనతో పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, కానీ అందుకు వ్యతిరేకించానని ఆమె చెప్పారు. ఈ కారణంగానే విద్యాసాగర్ తనపై కక్షగట్టాడని ఆమె ఆరోపించారు. పోలీసు అధికారి కాంతిరాణా టాటా నేతృత్వంలోనే తనపై తప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు. దాదాపు 10 నుంచి 15 మంది ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేశారని తెలిపారు. తన డివైస్ లన్నీ స్వాధీనం చేసుకున్నారని ఆమె వివరించారు. ఈ వ్యవహారంలో పొలిటిషన్లకు సంబంధం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు తాను చెప్పినవన్నీ నిజాలేనని నటి కాదంబరి జెత్వానీ స్పష్టం చేశారు. వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. చావు అంచుల వరకు వెళ్లారని చెబుతూ ఆమె భోరున విలపించింది.

#kadambari-jethwani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి