Mumbai: ప్లేసే లేనట్లు అక్కడ దాచింది.. అతి తెలివితో అడ్డంగా బుక్కైంది..!

ముంబై విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఉగాండాకు చెందిన యువతి విగ్, బ్రా ప్యాడ్, అండర్ వేర్‌లో దాచి కొకైన్‌ను తీసుకువచ్చింది. ఇది గుర్తించిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన కొకైన్ విలువ రూ. 8.90 కోట్లు ఉంటుందని తెలిపారు డీఆర్ఐ అధికారులు.

Mumbai: ప్లేసే లేనట్లు అక్కడ దాచింది.. అతి తెలివితో అడ్డంగా బుక్కైంది..!
New Update

Mumbai Airport: డ్రగ్స్ అక్రమ రవాణాకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.. స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఓ రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా ముంబైలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అధికారుల కల్లు గప్పి.. అక్రమ రవాణా చేస్తున్న కొకైన్‌ను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. విగ్, బ్రా ప్యాడ్, లోదుస్తుల్లో దాచిన రూ. 8.90 కోట్ల విలువైన కొకైన్‌ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఉగాండాకు చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు.

అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాండాకు చెందిన యువతి.. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలుత డీఆర్ఐ అధికారులు ఆమె వస్తువులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేదు. అయితే, ఆమె జుట్టును పరిశీలించగా నకిలీదని తేలింది. దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొకైన్ బయటపడింది. జుట్టు, బ్రా ప్యాడ్, లోదుస్తులను తనిఖీ చేయగా.. భారీ స్థాయిలో కొకైన్ లభించింది. దీని విలువ సుమారు రూ. 8.90 కోట్లు ఉంటుందని తెలిపారు అధికారులు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. మరికొందరు ఉగాండా పౌరులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందించింది. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. విమానాశ్రయంలో తనిఖీలను ముమ్మరం చేశారు.

కాగా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమీపిస్తుండటంతో ఇటీవలి కాలంలో స్మగ్లింగ్ నిరోధక సంస్థలు చాలా మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. చాలా మంది నిందితులు శానిటరీ ప్యాడ్‌లు, విస్కీ బాటిళ్లు, క్రీమ్ బాక్స్‌ల్లో దాచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు అధికారులు.

Also Read:

ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు..

ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి