IPL:10 వతరగతి పరీక్షల కోసం ఊరికి వెళ్తున్నా అంటున్న ముంబై ఆటగాడు ఇదేం రీజన్ రా బాబు అంటున్న నెటిజన్లు!

;చాలా మంది ఆటగాళ్లు గాయాల కారణంగా ఆయా టోర్నీలకు దూరం కావడం వింటుంటాం. కానీ, ఐపీఎల్​లో ముంబయి బౌలర్ 10వ తరగతి పరీక్షలు రాయాలంటూ టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఈ కారణం నవ్వు తెప్పిస్తున్నా ఇది నిజమేనట!

IPL:10 వతరగతి పరీక్షల కోసం ఊరికి వెళ్తున్నా అంటున్న ముంబై ఆటగాడు ఇదేం రీజన్ రా బాబు అంటున్న నెటిజన్లు!
New Update

ముంబయి ఇండియన్స్ యంగ్ బౌలర్ క్వేన మఫాకా 2024 ఐపీఎల్ టోర్నమెంట్​కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం తెలుసుకుంటున్న క్రికెట్ ఫ్యాన్ మాత్రం నవ్వుకుంటున్నారు. ఇలా కూడా టోర్నీకి ​దూరమవుతారా? అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్​ క్రియేట్ చేస్తున్నారు.

సౌతాఫ్రితాకు చెందిన మఫాకా 2024 ఐపీఎల్​ టోర్నీ నుంచి మధ్యలోనే స్వదేశానికి వెళ్లనున్నాడట. మఫాకా త్వరలోనే 10వ తరగతి పరీక్షలు (10th Exams) రాయాల్సి ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని అంటున్నారు. 2006లో జన్మించిన మఫాకా రీసెంట్​ (ఏప్రిల్​ 08)గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్​లో ఆడే ప్లేయర్ ఇంకా స్కూల్​లో చదువుతున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇటీవల జరిగిన అండర్- 19 వరల్డ్​కప్​లో మఫాకా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో ఏకంగా 21 వికెట్లు నేల కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో దిల్షన్ మధుషంక స్థానంలో ముంబయి ఇండియన్స్ మఫాకాను జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా మఫాకా రికార్డు కొట్టాడు. అయితే అరంగేట్ర మ్యాచ్​లోనే మఫాకా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముంబయి- సన్​రైజర్స్​తో మ్యాచ్​లో మఫాకా ఏకంగా వికెట్ లేకుండా 66 పరుగులు ఇచ్చి, చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. తర్వాత రాజస్థాన్​తో మ్యాచ్​లో ఒక వికెట్ పడగొట్టినప్పటికీ 11.50 ఎకనమీతో 2 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు.

ఇక ఈ సీజన్​లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి బోణీ కొట్టింది. ఇప్పటివరకూ 4 మ్యాచ్​లు ఆడిన ముంబయి ఒక మ్యాచ్​లో నెగ్గింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం దిల్లీని 205 పరుగులకే కట్టడి చేసి 2024 సీజన్​లో గెలుపు రుచి చూసింది.

#mumbai #ipl2024 #maphaka-u-19-world-cup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe