Air Traffic: ముంబై ఎయిర్ పోర్ట్ కొత్త రికార్డ్.. ఏమిటంటే.. ఎయిర్ ట్రాఫిక్ మూవ్ మెంట్స్ (ఏటీఎం)లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం(Air Traffic) సరికొత్త రికార్డును నెలకొల్పింది. నవంబర్ 11న దీపావళి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి 1,032 విమానాలను నడిపారు. By KVD Varma 17 Nov 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Air Traffic: దీపావళి పండుగ సమయంలో వరుసగా సెలవులు కలిసిరావడంతో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువైంది. రెగ్యులర్ విమానాలు కాకుండా.. ఈ సమయంలో ప్రత్యేకంగా విమానాలను నడిపాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్ పోర్ట్ రికార్డ్ సృష్టించింది. ఎయిర్ ట్రాఫిక్ మూవ్ మెంట్స్ (ఏటీఎం)లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం(Air Traffic) సరికొత్త రికార్డును నెలకొల్పింది. నవంబర్ 11న దీపావళి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి 1,032 విమానాలను నడిపారు. గతంలో ఒకే రోజులో అత్యధికంగా విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయిన రికార్డు ఐదేళ్ల క్రితం ఈ ఎయిర్ పోర్ట్ పేరిట ఉండేది. ఇక్కడ 2018 డిసెంబర్ 9న ఒక్కరోజే 1,004 విమానాలు నడిచాయి. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 11 న, విమానాశ్రయం మొత్తం 1,61,445 మంది ప్రయాణీకులను నిర్వహించిందని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఎఎల్) తెలిపింది, నవంబర్ 11 న, విమానాశ్రయం మొత్తం 1,61,445 మంది ప్రయాణీకులను నిర్వహించిందని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఎఎల్) తెలిపింది, ఇందులో 1,07,765 దేశీయ మరియు 53,680 అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. Also Read: వామ్మో వెండి కొనేట్టులేదుగా..బంగారం ధరా పెరిగింది..తాజాగా ఇలా.. దీపావళి వీకెండ్ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నవంబర్ 11 నుంచి 13 వరకు మొత్తం 5,16,562 మంది ప్రయాణికులను విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు. వీరిలో 3,54,541 మంది దేశీయ మార్గాల్లో ప్రయాణించగా, 1,62,021 మంది అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించారు. ఈ వారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2,137 దేశీయ విమానాలు, 757 అంతర్జాతీయ విమానాలతో 2,894 టేకాఫ్లను నిర్వహించింది. నవంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు ఎక్కువగా దేశీయ మార్గంలోనే విమాన సర్వీసులు నడిచాయి. అంతర్జాతీయంగా దుబాయ్, లండన్, అబుదాబి, సింగపూర్ లకు విమానాలు ఎక్కువగా వెళ్లాయి. Watch this interesting Video: #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి