వరద ముంపులో ములుగు..ప్రత్యేక హెలికాప్టర్‌తో సహాయక చర్యలు

ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా అత్యంత భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. భారీ వర్షల‌కు ములుగు జరదిగ్బంధంలో మునిగిపోయింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఎదుట రోడ్డు నీట మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు గ్రామాలలోని ప్రజాప్రతినిధులు సమన్వయంతో చెరువులు, వాగులు, ప్రాజెక్టుల నీటి నిలువల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

New Update
వరద ముంపులో ములుగు..ప్రత్యేక హెలికాప్టర్‌తో సహాయక చర్యలు

 Mulugu in flood..Rescue operations with special helicopter

అప్రమత్తంగా ఉండాలి

నేడు ములుగు (mulugu) మండలంలోని జంగాలపల్లి జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న నీరు.. నిలిచిపోయిన రాకపోకలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క (mla seethakka)పరిశీలించారు. అదే విధంగా మదనపల్లి, బండారు పల్లి, సింగర కుంటపల్లి,గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ నిన్న ములుగులో భారీ వర్షాలు కురువడంతో వరుద నీరు ఇండల్లోకి చేరిందన్నారు. రోడ్లపై నుంచి వరుద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడిందన్నారు. ఇండ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఆమె అన్నారు.

ముందస్తు చర్యలు తీసుకోవాలి

ఇండ్లు, గుడిశలలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి, వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్ అధికారులు.. సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుంది కాబట్టి.. రోడ్డు రవాణా,విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీస్ విద్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

సందర్శకులను కాపాడుతాం

ముత్యాల ద్వారా జలపాతం వీక్షించడానికి వెళ్లిన సందర్శకులు దారితప్పి అడవిలో చిక్కుకున్న విషయం జిల్లా ఎస్పీ దృష్టికి రాగానే సందర్శకులతో ఫోన్‌లో మాట్లాడారు. చిక్కుకుపోయిన పర్యాటకులతో మాట్లాడిన ఎస్పీ వాగు దాటేందుకు ఎట్టి పరిస్థితులలో ప్రయత్నించవద్దని, రెస్క్యూ బృందాలు హుటాహుటిన తమ వద్దకు చేరుకుంటారని అప్పటివరకు వారు ఎత్తైన ప్రదేశంలో ఉండాలన్నారు. వారి మొబైల్ బ్యాటరీ భద్రపరచుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దిగులు చెందవద్దని మనోధైర్యంతో ఉండాలని ఆహార పదార్థాలు, ఇతర రెస్క్యూ పరికరాలు తమ వద్దకు పంపించినట్లు, అప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ఉండాలని కోరారు. జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్( NDRF) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి పంపి వారిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడి తీరుతామని ఎస్పీ గౌస్ ఆలం (SP Gauss Alum) తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ అధికారులను అప్రమత్తం చేసి వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Mulugu in flood..Rescue operations with special helicopter

స్పెషల్ అధికారుల నియామకం

సీఎం కేసీఆర్ ( CM KCR) ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకుగాను పలు జిల్లాలకు పలువురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Chief Secretary Shantikumari) ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లాకు కృష్ణ ఆదిత్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సభ్య కార్యదర్శిగా, భూపాలపల్లి జిల్లాకి పి.గౌతమ్, సెర్ప్, సీఈవోగా, నిర్మల్‌కు ముషారఫ్ అలీ, ఎక్సయిజ్ శాఖ, కమీషనర్, మంచిర్యాలకు భారతి హోలికేరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, స్పెషల్ సెక్రెటరీ, పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ, ఆసిఫాబాద్-హన్మంత రావు, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు