Sreemukhi : త్వరలోనే శ్రీముఖి పెళ్లి.. మ్యాటర్ లీక్ చేసిన జబర్దస్త్ కమెడియన్!

శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. శ్రీముఖికి వాళ్ళింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఇయర్ లోనే ఆమె పెళ్లి ఉండొచ్చని అన్నాడు.

New Update
Sreemukhi : త్వరలోనే శ్రీముఖి పెళ్లి.. మ్యాటర్ లీక్ చేసిన జబర్దస్త్ కమెడియన్!

Jabardasth Comedian About Sreemukhi Marriage : బుల్లితెర గ్లామరస్ యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గతంలో చాలా సార్లు శ్రీముఖి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అవేవి నిజం కాదని తెలిసింది.

ఇక తాజాగా మరోసారి ఈ యాంకర్ పెళ్ళికి రెడీ అయిందనే న్యూస్ బయటికి వచ్చింది. అందుకు కారణం జబర్దస్త్ కమెడియన్ అవినాష్. శ్రీముఖికి క్లోజ్ ఫ్రెండ్ అయిన అవినాష్ తాజాగా శ్రీముఖి పెళ్లి మ్యాటర్ ని లీక్ చేశాడు.

Also Read : ఓటు వేసిన బన్నీ.. ఎన్టీఆర్ 

ఈ ఏడాదిలోనే శ్రీముఖి పెళ్లి

శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఫిమేల్ యాంకర్స్ లో సుమ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ పాపులారిటీ శ్రీముఖికి దక్కింది. గత కొన్నేళ్లలో ఈమె క్రేజ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. ప్రతుతం చేతినిండా టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తోంది.

ఇక ఎట్టకేలకు శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. శ్రీముఖికి వాళ్ళింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, బహుశా ఈ ఇయర్ లోనే ఆమె పెళ్లి ఉండొచ్చని అన్నాడు. దీంతో శ్రీముఖి పెళ్లి వార్త ప్రతుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు