Mukesh Ambani: రిలయన్స్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి(Mukesh Ambani) మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ఇంతకు ముందు బెదిరింపులకు పాల్పడిన అదే ఇమెయిల్(Email) ఖాతా నుండి మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. అయితే, దుండగులు ఈసారి రూ.200 కోట్లు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ మ్యాటర్‌ను వారు సీరియస్‌గా తీసుకున్నారు.
ముందుగా మెయిల్ చేసిన దుండగులు రూ. 20 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ మెయిల్‌కు రెస్పాండ్ అవలేదనే కారణంగా మరో మెయిల్ పంపించారు అగంతకులు. మొదటి మెయిల్‌కు రెస్పాండ్ అవనందుకు పనిష్‌మెంట్‌గా రూ. 200 కోట్లు చెల్లించాలని, లేని పక్షంలో చంపేస్తామంటూ ముఖేష్ అంబానికి మరో మెయిల్ పంపించారు. మొదట ఏదైతే మెయిల్ ఐడీతో పంపించారో.. అదే మెయిల్ ఐడీతో మరోసారి మెసేజ్ పెట్టారు. డబ్బు పంపకపోతే.. తామే నేరుగా వస్తామని, ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ముఖేష్ అంబానీకి మొదట మెయిల్ చేసిన దుండగులు.. ఆయనను తీవ్రంగా బెదిరించారు. రూ. 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిస్థితిని ఊహించలేవని హెచ్చరించారు. తమ వద్ద అత్యుత్తమ షూటర్ ఉన్నారని, దేశంలోనే బెస్ట్ షూటర్ అని పేర్కొన్నారు. ఆ షూటర్ అంబానీనీ కాల్చేస్తాడంటూ మెయిల్‌లో పేర్కొన్నారు దుండగులు.
పోలీసుల విచారణ..
ఇమెయిల్‌ను అందుకున్న తరువాత ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆదారంగా గామ్‌దేవి పోలీసులు ఐపీసీ సెక్షన్లు 387, 506(2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ ఐపీ అడ్రస్ తదితర వివరాలను సేకరిస్తున్నారు.
ఫిబ్రవరిలోనూ బెదిరింపులు..
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనూ ముఖేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి ముఖేష్ అంబానీ ఇంటిని పేల్చివేస్తామని బెదిరించాడు. ఆ తరువాత అలర్ట్ అయిన అధికారులు ముఖేష్ అంబానీ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Also Read:
అంతవరకు తెచ్చుకోకండి.. వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్..
దేవరకొండలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అనుచరులు..