భారతదేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్త అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు ఆనంద్ అంబానీ వివాహానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుక మే 28,29,30న దక్షిణ ఫ్రాన్స్ తీరంలో ఒక విలాసవంతమైన యాచ్‌లో జరగనుంది.
గుజరాత్ జామ్‌నగర్‌లో జమ్జామ్గా మొదటి ప్రీ వెడ్డింగ్ ఇప్పటికే జరగగా, లండన్‌లో ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన స్టోక్ పార్క్‌లో వివాహ వేడుకను కేవలం ముఖ్యమైన కుటుంబ సభ్యులతో మాత్రమే ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే రెండో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరగనుందని సమాచారం. రెండవ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం విడుదల కాలేదు, అయితే దాని గురించి వార్తలు భారతదేశం అంతటా వ్యాపించాయి. ఈ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుక మూడు రోజుల పాటు లగ్జరీ క్రూయిజ్ షిప్లో జరగనుంది.
ఇటలీ నుండి బయలుదేరి దక్షిణ ఫ్రాన్స్‌లో ముగిసే ఈ లగ్జరీ క్రూయిజ్‌లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నివేదికలు వెల్లడైయాయి.ఈ వేడుకకు దాదాపు 800 మంది అతిథులు హాజరవుతారని సమాచారం.ఇటలీ నుంచి బయలుదేరిన ఈ నౌక 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించనుంది. ముఖ్యంగా, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఆనంద్ బ్రిమల్ మరియు కోకిలాబెన్ అంబానీలతో సహా మొత్తం అంబానీ కుటుంబం మార్చిలో జరిగిన మొదటి ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు.
ఒక్క గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కే దాదాపు రూ.1260 కోట్లు ఖర్చు చేశారని, క్యాటరింగ్ కాంట్రాక్ట్‌కే రూ.200 కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు తమ కొడుకు ఆనంద్ అంబానీ పెళ్లి రోజును మరిచిపోలేని విధంగా చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఆనంద్ అంబానీ, రాధికా మర్చంట్ జులై 12న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ఘనంగా ఏర్పాట్లు చేయడం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.