Mudragada: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దారెటు?

ఏపీలో ముద్రగడ పోల్టికల్ రీఎంట్రీకి అన్ని పార్టీలు డోర్స్ క్లోజ్ చేసినట్లేనని అర్థమవుతోంది. మొదట వైసీపీలో చేరుతున్నారని వార్తలు వినిపించాయి. ఆ తరువాత జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, జనసేన మాత్రం ముద్రగడను పట్టించుకోనట్లు తెలుస్తోంది.

New Update
Mudragada: నాతో కలిసి రండి.. ఆ రోజే వైసీపీలోకి వెళ్తున్నా: ముద్రగడ!

Mudragada: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దారెటు? పది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ..త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేశాయి. మొదట వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అధికార పార్టీలో ఎమ్మెల్యే స్థానం  లేదంటే ఒక ఎంపీ స్థానం అయినా పర్లేదని  అశించారు ముద్రగడ. అయితే, అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.

Also Read: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి.. 

ముద్రగడను కలిసిన జనసేన నేతలు.. పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వచ్చి మరి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయనకు భరోసా కల్పించారు. అయితే, ఈ ప్రచారం నెల రోజులు దాటినా కూడా ముద్రగడను మాత్రం జనసేనాని కలవలేదు. నిన్న రాజమండ్రిలో పర్యటించినప్పటికి ముద్రగడను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. దీంతో, ముద్రగడ పోల్టికల్ రీఎంట్రీ లేనట్లేనా? అని అనుమానం కలుగుతుంది. ఇదిలా ఉండగా, ఏపీలో ఇప్పటికే జనసేన తప్ప మిగితా అన్ని పార్టీలు ముద్రగడకు డోర్స్ క్లోజ్ చేసినట్లేనని అర్థమవుతోంది. పవన్‌ రాకపై ముద్రగడ స్పందిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. మనం చెప్పాల్సింది చెప్పాం తర్వాత మనం..చేసేది ఏమి లేదంటూ చెప్పుకొచ్చారు.

Also Read: గిరిజనుల గుండెల్లో కొలువైన దేవతలకు భక్తజన నీరాజనం సమ్మక్క-సారక్క జాతర

కాగా, ఏపీ రాజకీయాల్లో కాపు ఉద్యమనేతగా పేరు పొందారు ముద్రగడ పద్మనాభం. గతంలో జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాశారు. దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో జనసైనికుల మధ్య ముద్రగడ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.

#mudragada
Advertisment
తాజా కథనాలు