/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-15-jpg.webp)
Mudragada Padmanabham: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ గత మేనిఫెస్టోలో 99% పూర్తి చేసారని.. మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఎంత వరకు అమలు చేశారు.. మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు అమలు చేశానని చెప్పగల ధైర్యం మీకు ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు.
Also Read: వైసీపీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో పోసాని కృష్ణ మురళి.. 37 మందిలో ఎవరెవరు ఉన్నారంటే..?
ఈ క్రమంలోనే.. పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. ముద్రగడ పద్మనాభం కాకుండా.. పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ నిత్యం బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తుని సంఘటనపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గంజాయి బ్యాచ్ కి, బ్లేడ్ బ్యాచ్ కి నాయకత్వం వహించారని తాను అనుకుంటున్నారన్నారు.
Also Read: 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు.. 25 ని.ల్లోనే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో పోటీ చేయకుండా తూర్పుగోదావరికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పిఠాపురం నుండి ప్రజలు ఓటు రూపంలో తన్ని తరిమేస్తారన్నారు. త్వరలో మీ పార్టీ ప్యాకప్ అంటూ కామెంట్ చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రమే నిర్మించాలని ఈ విషయంపై కేంద్రంతో తేల్చుకోవాలని అన్నారు.