Muddaraboina Venkateswara Rao: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు భారీ ర్యాలీతో వెళ్లి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు మరో సెట్ నామినేషన్ వేశారు ఆయన సతీమణి ముద్దరబోయిన వెంకట రాధిక.
Also Read: ముద్రగడ ఒక పెద్ద దరిద్రం.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!
ఈ సందర్భంగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నూజివీడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పార్థసారధికి సవాల్ విసిరారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దాం, నీకంటే ఒక్క ఓటు ఎక్కువ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. 2004 సంవత్సరంలో గన్నవరం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందానని, నేడు నూజివీడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండి తప్పనిసరిగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: జనసేన మార్పు తీసుకొస్తుంది.. అనకాపల్లిలో జబర్దస్త్ హైపర్ ఆది ప్రచారం..!
నూజివీడు ప్రజలు తనను ఆదరించి తప్పకుండా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయని, తనన్ను గెలిపిస్తే తప్పకుండా నూజివీడు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు టీడీపీలో కష్టపడి పని చేసినప్పటికీ అధిష్టానం వైసీపీ నుండి వచ్చిన వారికి టిక్కెట్టు కేటాయించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు తెలిపారు. తనకు ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని తెలిపారు. టీడీపీలో నాయకులని నమ్ముకుని రెండుసార్లు ఓటమి పాలయ్యానని చెప్పారు.