MS Dhoni Birthday special: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ, వేరెవరికీ సాధ్యం కాని రికార్డు మహీ సొంతం..!!

MSధోనీ...క్రికెట్ ప్రపంచంలో ఆయన ఓ సంచలనం. బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా టీమిండియాకు ధోని చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. కీపింగ్ విషయంలో ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ లో వేగతవంతమైన స్టంపింగ్‌గా ప్రపంచ రికార్డు ధోనీ సొంతం. దీనిని ఏ వికెట్ కీపర్ కూడా బ్రేక్ చేయలేదు. అతను వికెట్ వెనుక నిలబడి ఉంటే, బ్యాట్స్‌మన్ చాలా అరుదుగా ముందుకు వెళ్లి ఆడతాడు. రెప్పపాటులో స్టంపింగ్స్ చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ 195 స్టంపింగ్‌లు చేశాడు. నేడు ఎంస్ ధోనీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ధోనీ అద్బుతమైన 5 స్టంపింగ్ లు ఏవో చూద్దాం.

New Update
MS Dhoni Birthday special: స్టంప్స్ వెనకాల సూపర్ మ్యాన్ ధోనీ, వేరెవరికీ సాధ్యం కాని రికార్డు మహీ సొంతం..!!

వికెట్‌ వెనుక ఎంఎస్‌ ధోని చురుకుదనం ఎవరికీ కనిపించదు. బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా టీమిండియాకు ధోనీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. కీపింగ్ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకరు. 538 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ధోని 195 స్టంపింగ్‌లు చేశాడు. అందుకే ధోనీకి బెస్ట్ వికెట్ కీపర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన స్టంపింగ్‌గా MS ధోని ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. దీనిని ఏ వికెట్ కీపర్ కూడా ఇంతవరకు బ్రేక్ చేయలేదు. అతను వికెట్ వెనుక నిలబడి ఉంటే, బ్యాట్స్‌మన్ చాలా అరుదుగా ముందుకు వెళ్లి ఆడతాడు. రెప్పపాటులో స్టంపింగ్స్ చేయడంలో ధోనీ దిట్ట. అలాంటి ధోని 5 ఫాస్టెస్ట్ స్టంపింగ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

MS_Dhoni_stumping

1. ధోనీ, కీమో పాల్:
2018లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కీమో పాల్‌ను ధోనీ స్టంపౌట్ చేశాడు. కేవలం 0.08 సెకన్లలో కీమో పాల్‌ను ధోనీ స్టంపౌట్ చేశాడు. ఫాస్టెస్ట్ స్టంపింగ్‌గా ఇది ప్రపంచ రికార్డు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.

2. ధోనీ, టిమ్ సీఫెర్ట్:
ఫిబ్రవరి 10, 2019న హామిల్టన్‌లో జరిగిన 3వ T20I సమయంలో కుల్దీప్ యాదవ్‌పై న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫెర్ట్‌ను స్టంప్ చేయడానికి MS ధోని కేవలం 0.099 సెకన్లు తీసుకున్నాడు. కుల్దీప్ అవుట్ ఆఫ్ బౌల్డ్, సీఫెర్ట్ ఆడటానికి బయటకు వెళ్లి తప్పించుకున్నాడు. తిరిగి క్రీజులోకి వచ్చే సమయానికి ధోని స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్ ధోనీకి 300వ మ్యాచ్.

3. ధోనీ, మిచెల్ మార్ష్:
2012లో ఆస్ట్రేలియా పర్యటనలో ఎంఎస్ ధోని మిచెల్ మార్ష్‌ను స్టంపౌట్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మ చేతిలో మిచెల్ మార్ష్ 0.09 సెకన్లలో స్టంపౌట్ అయ్యాడు.

4. ధోనీ, శుభమాన్ గిల్:
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో, ధోని ఒక్క సెకనులోపు శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేశాడు. 0.12 సెకన్లలో గిల్‌ను స్టంపౌట్ చేశాడు.

5. ధోనీ, జార్జ్ బెయిలీ:
2016లో ఎంసీజీ మైదానంలో మెరుపు వేగంతో ధోని స్టంపౌట్ చేశాడు. మూడో వన్డేలో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జార్జ్ బెయిలీని ధోని 0.19 సెకన్లలో స్టంపౌట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు