MRF Share: దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!

MRF షేర్ ధర ఎప్పుడూ అన్ని దేశంలో టాప్ లోనే ఉంటుంది. అయితే ఇది గత ఆరునెలల్లో విపరీతమైన లాభాలను తెచ్చింది. జూన్ 2023లో లక్ష రూపాయలు టచ్ చేసి రికార్డ్ సృష్టించిన MRF షేర్ ఫిబ్రవరి22, 2024న లక్షన్నర రూపాయలను టచ్ చేసి సంచలనం సృష్టించింది.  

New Update
MRF Share:  దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!

MRF Share: మన దేశంలో అత్యధిక ధర కలిగిన షేర్ ఏదైనా ఉందీ అంటే అది MRF మాత్రమే. ఎప్పుడూ ఈ షేర్ రికార్డులు సృష్టిస్తూనే ఉంటుంది. తాజాగా బుధవారం దీని ఒక్కో షేర్ లక్షన్నర పలికింది. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. MRF షేర్ ధరలు జూన్ 22 నుంచి 10% ర్యాలీ తీసుకుని లక్ష రూపాయలను తాకింది. మన స్టాక్ మార్కెట్లో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి షేర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ (MRF Share)తన రికార్డులు తానే బద్దలు కొడుతూ ఏకంగా లక్షన్నర టచ్ చేసింది ఈ షేర్ కా బాప్. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు అంటే బుధవారం, ఫిబ్రవరి 22న NSE లో MRF షేర్లు 27,248 చేతులు మారాయి. వాటి విలువ మొత్తం 384.6 కోట్ల రూపాయలు.

గత మూడు నెలల్లో, MRF 24% రాబడిని అందించింది.  గత సంవత్సరంలో, ఇది 53% రాబడిని ఇచ్చింది. FY23-24 రెండవ త్రైమాసికంలో, ప్రముఖ టైర్ల తయారీ సంస్థ MRF అదిరిపోయే నికర లాభాలను నమోదు చేసింది. బాటమ్ లైన్ ఏడాది ప్రాతిపదికన దాదాపు ఐదు రెట్లు(MRF Share) పెరిగి రూ. 572 కోట్లకు చేరుకుంది, అయితే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 6.5% పెరిగి రూ. 6,088 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ EBITDA రెండింతలు పెరిగి రూ. 1,129.09 కోట్లకు చేరుకుంది.  దీనితో ఆపరేటింగ్ మార్జిన్ 1,038 బేసిస్ పాయింట్లు పెరిగి 18.55%కి చేరుకుంది.

ఇక దీని టెక్నీకల్ కోణాన్ని పరిశీలిస్తే.. MRF స్టాక్(MRF Share)ప్రస్తుతం ఓవర్‌బాట్ జోన్‌లో ఉంది, ఒక రోజు RSI (14) 87.1. 30 కంటే తక్కువ ఉన్న RSI ఓవర్‌సోల్డ్ పరిస్థితులను సూచిస్తుంది.  అయితే 70 కంటే ఎక్కువ ఓవర్‌బాట్ పరిస్థితులను సూచిస్తుంది. 4568.2 వద్ద MACD దాని సెంటర్ సిగ్నల్ లైన్ పైన ఉంది.  ఇది బుల్లిష్ ట్రెండ్‌ను సూచిస్తుంది.

MRF ప్రస్తుతం(MRF Share) దాని 20-రోజులు, 50-రోజులు, 100-రోజులు..  200-రోజుల సాధారణ ఎవరేజెస్ కంటే ఎక్కువగా బిజినెస్  చేస్తోంది. ట్రెండ్‌లైన్ ప్రకారం, 1-సంవత్సరం బీటా 0.2తో స్టాక్ తక్కువ అస్థిరతను ఇది చూపింది.

mrf stock price

మొత్తంగా చూసుకుంటే MRF తన ప్రతిష్టను ఇటు షేర్ మార్కెట్లోనూ.. అటు కంపెనీ లాభాల్లోనూ కూడా నిలబెట్టుకుంటూ వస్తోందని చెప్పవచ్చు. ఇది ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి అంటే ఉదయం 9 గంటలకు 1,49,206 రూపాయల వద్ద ప్రారంభం అయింది. అక్కడ నుంచి పెరుగుతూ ఒకదశలో అంటే.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1,59,610 రూపాయలకు చేరుకొని దేశంలో ఈ మార్క్ చేరుకున్న తొలి స్టాక్ గా రికార్డు సృష్టించింది. తరువాత మార్కెట్ ముగిసే సమయానికి కాస్త కిందికి దిగివచ్చి.. 1,49,686 రూపాయల వద్ద స్థిరపడింది. రోజు మొత్తంగా చూసుకుంటే 480 రూపాయల లాభంతో షేర్ రోజును ముగించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు