Mr.Bachchan Movie : రవితేజ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మిశ్రమ స్పందనలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా చాలా ల్యాగ్ అయిపోయిందని, అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి.
ఈ నేపథ్యంలో సినిమా రన్ టైమ్‌ను తగ్గించేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించి, రన్ టైమ్‌ను తగ్గించారు. సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిస్టర్ బచ్చన్ సినిమా నుండి దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ ద్వారా తెలిపింది.
Also Read : మహేష్ కొడుకుతో ‘మురారి’ సీక్వెల్.. కృష్ణవంశీ రియాక్షన్ ఇదే..!
సినిమా రన్ టైమ్ తగ్గించడం వల్ల కథనం బలపడుతుందని, క్లైమాక్స్‌కు మరింత బలం చేకూరుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో ఈ కొత్త వెర్షన్‌ను ప్రదర్శించడం మొదలుపెట్టారు. మరి ఈ మార్పులతో 'మిస్టర్ బచ్చన్' ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా? అనేది చూడాలి.