/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet7-jpg.webp)
MP Raghu Rama Krishna Raj: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీకి రాజీనామా చేశారు. గత సంక్రాంతికి భీమవరం వచ్చిన ఆయన..ఫిబ్రవరిలో పార్టీకీ రాజీనామా చేస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే పార్టీకి రాజీనామా చేశారు వైసీపీ రెబల్ ఎంపీ. 2019 లో అధికార పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. త్వరలో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా ఏ పార్టీ కోరుకుంటే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.
Also Read: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!
I hereby tender my resignation for the primary active membership of YSRC Party. pic.twitter.com/IFyNkV1RO2
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) February 24, 2024
ఈ సందర్భంగా లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హులుగా చేయడానికి మొహమ్మద్ గజినీలా చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదని పేర్కొన్నారు. గత మూడున్నర సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు.
Also Read: మందు బాబులకు బిగ్ షాక్.. ఎండాకాలంలో బీర్ల కొరత!
ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే తన దృఢ నిశ్చయానికి గుర్తుగా.. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రఘురామ వెల్లడించారు. రాజీనామ లేఖను వెంటనే ఆమోదించాలని కూడా కోరారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి, అది మన ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని అన్నారు.