Fake Bank Guarantees Scam: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!

ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో మిథున్ రెడ్డి (PLR), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Raghava), విశ్వేశ్వరరెడ్డి (Shirdi Sai), ప్రతిమా శ్రీనివాసరావు (Prathima) ఉన్నారు. డిస్కమ్, మైనింగ్ & జియాలజీ శాఖల్లో వీరి ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు కనిపిస్తున్నాయి.

Fake Bank Guarantees Scam: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!
New Update

ఫేక్ గ్యారంటీల పేరిట ప్రభుత్వాన్ని మోసం చేస్తూ.. లక్షల కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న ప్రాజెక్టులను ప్రశ్నార్థకం చేస్తున్న 'మెగా' కంపెనీల దందాను ఆర్టీవీ బయటపెట్టిన విషయం తెలిసిందే. మేఘా సంస్థతో పాటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో పలు ప్రముఖులకు చెందిన కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో..

- మిథున్ రెడ్డికి చెందిన PLR
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Raghava)
- విశ్వేశ్వర్ రెడ్డి (Shirdi Sai)
- ప్రతిమ శ్రీనివాసరావు (Prathima)
- NCC
డిస్కమ్, మైనింగ్ అండ్ జియాలజీ ప్రాజెక్టుల్లో వీరి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు విరివిగా కనిపిస్తున్నాయి.
publive-image

దేశ సంపదతో ఆటలు..
ఫేక్ గ్యారెంటీలతో దేశ సంపదతో బిగ్ కాంట్రాక్టర్లు ఆటలు ఆడుతున్న వైనాన్ని ఆర్టీవీ నిన్న వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సెయింట్ లూసియాలో ఉండే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఓ చిన్న ఫినాన్షియల్‌ కంపెనీ ఇండియాలో లక్షల కోట్ల మోసాలకు ఎలా కారణమవుతోంది ఆర్టీవీ ఆధారాలతో సహా బయటపెట్టింది. కేవలం రూ.8 కోట్ల నికర విలువ మాత్రమే కలిగిన ఈ డమ్మీ బ్యాంక్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 481 కోట్ల గ్యారెంటీలు ఇచ్చిన షాకింగ్ విషయాన్ని ఆర్టీవీ ప్రజల ముందు ఉంచింది.

పుష్కలంగా అండదండలు..
ప్రభుత్వ పెద్దలకు తెలిసే ఇంత పెద్ద ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల దందా జరుగుతోందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఏపీ విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మా జనార్ధన్ రెడ్డి తదితరులు ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వీరితో పాటు బయటపడని అనేక మంది కూడా ఈ దందాలో భాగస్వామ్యం అయి ఉండొచ్చన్న సందేహాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

అసలు విషయం చెప్పేసిన బ్యాంక్ ప్రతినిధి..
సీనియర్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను ఇస్తున్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులతో ఓ కంపెనీ ప్రతినిధి మాదిరిగా మాట్లాడి.. వారి బాగోతాన్ని బయటపెట్టారు. ఈ ఫోన్ కాల్ లో ఆ బ్యాంక్ ప్రతినిధి చైతన్య కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ తమ అతి పెద్ద క్లయింట్ అంటూ చెప్పడం గమనార్హం. కేవలం ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలతో పాటు.. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలతో సైతం ఈ సంస్థ భారీగా లబ్ధిపొందినట్లు ఈ విషయాన్ని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. ఈ దొంగ బ్యాంక్.. 432 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ ఫ్రా లిమిటెడ్‌కు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడొచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి