MP Gorantla Madhav: నాకు టికెట్ ఇవ్వకపోతే..ఎంపి గోరంట్ల మాధవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

తాను సజ్జలతో గొడవ పడినట్లు టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్. పార్టీ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. అధినేత జగన్ ఆదేశాలు మాకు శిరోధార్యం అంటూ కామెంట్స్ చేశారు.

MP Gorantla Madhav: నాకు టికెట్ ఇవ్వకపోతే..ఎంపి గోరంట్ల మాధవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
New Update

MP Gorantla Madhav: టీడీపీ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తూ లేనిపోని హడావిడి చేస్తోందన్నారు వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో అందరితో ఓర్పుగా మాట్లాడతారన్నారు. అయితే, తాను సజ్జలతో గొడవ పడినట్లు టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేవలం అధికార పార్టీలో కలహాలు పెట్టడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అయితే, ఇలాంటి కుట్రలు ఎన్నీ చేసిన వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యనించారు.

Also Read: కేసీఆర్ కు జగన్ పరామర్శ.. షర్మిల ప్రస్తావన వచ్చిందా?

2019లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందని.. 2024 ఎన్నికల్లో వారికి 3 సీట్లు మాత్రమే మిగులుతాయని ఎద్దెవ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే సీఎం జగన్ మార్పులు చేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలోనే హిందూపురంలో బోయ సమాజిక వర్గాన్ని పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

వైసీపీ తనకు రాజకీయం నేర్పిన కన్న తల్లి లాంటిదని కామెంట్స్ చేశారు. రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చి సీఎం జగన్ తనను ఎంపిని చేసి ఢిల్లీ పంపారని.. అలాంటి పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటాని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం ఆఫీస్ తమకు ఇల్లు లాంటిదని.. రోజుకి పది సార్లు అయినా వెళ్లి వస్తామని అన్నారు. పార్టీ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. అధినేత జగన్ ఆదేశాలు మాకు శిరోధార్యం అంటూ వ్యాఖ్యనించారు.

#andhra-pradesh #mp-gorantla-madhav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe