Gorantla Madhav: నేను అన్నది 'చంద్రబాబు చస్తాడని' కాదు.. క్లారిటీ ఇచ్చిన గోరంట్ల మాధవ్

2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అని గోరంట్ల మాధవ్ అన్న వ్యాఖ్యల పట్ల టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తన వ్యాఖ్యల పట్ల ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు.

New Update
Gorantla Madhav: నేను అన్నది 'చంద్రబాబు చస్తాడని' కాదు.. క్లారిటీ ఇచ్చిన గోరంట్ల మాధవ్

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇటీవల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆయన నోరు పారేసుకున్నారు. "చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు. ఇక సీఎం జగనే. ఆయనను ఎదిరించే నాయకులు కూడా లేరు. పవన్‌ కొన్ని రోజులు రాజకీయాలంటూ ఊగుతాడు. ఆ తరువాత సినిమాలు అంటూ వెళ్లిపోతాడు” అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యనించారు.

Also Read: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కేరళ.. అసలేమైందంటే?

ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ టీడీపీ నాయకులు ముందు నుంచే ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆయనను జైలులోనే అంతం చేయాలని చూస్తున్నారని నారా లోకేష్‌ అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో మాధ‌వ్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబును అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పడానికి ఎంపీ వ్యాఖ్యలే నిదర్శనమని టీడీపీ నేతలు మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు టీడీపీ శ్రేణులు.

Also Read: మీ పిల్లలు పదేపదే ఫోన్‌ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్‌ ప్రకటన..!

అయితే, తాజాగా తన వ్యాఖ్యల పట్ల ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. తాను అన్న వ్యాఖ్యలను మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఉచ్చారణ దోషం వల్ల టీడీపీ వాళ్లకు అలా అనిపించి ఉండొచ్చని తెలిపారు. చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుగా ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు