ఇప్పటివరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా ఉన్న తమన్న ఇప్పుడు ఈమె వయసు 33 ఏళ్లు కాగా.. నటిగా దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇటీవలే విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. అయితే నటిగా గ్లామర్ విషయంలో మాత్రం రోజు రోజుకు మరింత బోల్డ్‌గా తయారవుతోంది ఈ భామడు. ఎందుకంటే ఇటీవలే జీ కర్దా, లస్ట్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌ల్లో ఈమె శృంగార భరిత సీన్స్‌తో పీక్ స్టేజ్‌కు చేరుకుందనే చెప్పాలి. దీంతో పలువురు తమన్నకు ఏమైంది అంటూ ఘాటుగా విమర్శిస్తుంటే.. ఆవిడ మాత్రం ఈ సమాజానికి ఏమైంది అంటూ ఎదురు ప్రశ్న వేయడం మరో విశేషం.
అయితే లస్ట్ స్టోరీస్–2 వెబ్, జీ కర్దా సిరీస్‌లలో బెడ్ రూమ్ సన్నివేశాలను లిప్ లాక్ సన్నివేశాలలో విజృంభించి నటించిన తమన్నా తాను సినిమాలో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలనుకుంటున్నానని అందుకే అలా నటిస్తున్నట్లు హీరోయిన్ తమన్నా సమర్ధించుకుంది. అయితే తాజాగా అసలు విషయం కాస్త వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో నటించడానికి ఏకంగా రూ.7 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. తన కెరీర్లో ఇదే భారీ రెమ్యూనరేషన్ కావడంతో ఈ భామ హద్దులకు బ్రేకులు వేయకుండా రెచ్చిపోయి మరి ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా.. ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ నాలుగు నుంచి ఐదు కోట్ల లోపే ఉంటుంది. కానీ.. లస్ట్ లవ్ స్టోరీస్- 2 వెబ్ సిరీస్‌లో ఆమెకు హద్దులు మీరిన శృంగార భరిత సన్నివేశాలు 30 నిమిషాల వరకు ఉండడంతో తమన్నా నటించడానికి నిరాకరించరాదన్న కారణంగా ఆ చిత్ర నిర్మాతలు ఆమెకు రూ.7 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం ఈ గోల్డెన్ బ్యూటీ తమిళంలో రజినీకాంత్ సరసన నటిస్తున్న జైలర్ చిత్రం ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. చేతినిండా చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ మిల్కీ బ్యూటీ. ఎంతో సాంప్రదాయకంగా ఉండే తమన్నాకు ఏమైందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.