జవాన్‌లో నీ లుక్ చూసి నా కొడుకు చాలా భయపడ్డాడు.. అని ఓ నెటిజన్ షారుఖ్‌కు ట్యాగ్ చేశాడు. దీనికి షారుఖ్ క్షమించండి.. సినిమా భయపడేంతలా ఏమీ ఉండదు. ఎప్పుడైనా అతనికి చూపించొచ్చని సూచించాడు. జవాన్ రోల్ కోసం మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకునేందుకు సినిమాలేమైనా చూశారా..? అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ.. అట్లీ డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు చూశా. ప్రపంచంలోని లాంగ్వేజ్లన్నింటిని అర్థం చేసుకోవడానికి విజయ్ సార్, అల్లు అర్జున్ జీ, రజినీ సార్, యశ్‌తోపాటు ఇతర స్టార్ హీరోల సినిమాలు చూశా. ఆ తర్వాత నా స్టైల్లో జవాన్ రోల్‌కు ప్రిపేర్ అయ్యానని షారుక్ చెప్పుకొచ్చాడు.
పూర్తిగా చదవండి..నెటిజన్ చేసిన హాట్ కామెంట్‌పై షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ జవాన్. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్ పోషిస్తోంది. జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్ అభిమానులు, నెటిజన్లతో సోషల్ మీడియాలో పాల్గొని పలు కామెంట్లతో ఆకట్టుకున్నాడు.
Translate this News: