నెటిజన్‌ చేసిన హాట్ కామెంట్‌పై షారుఖ్‌ ఖాన్‌ రియాక్షన్‌ ఇదే..!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ జవాన్. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్‌ పోషిస్తోంది. జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది‌. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్‌ ఖాన్‌ అభిమానులు, నెటిజన్లతో సోషల్‌ మీడియాలో పాల్గొని పలు కామెంట్లతో ఆకట్టుకున్నాడు.

New Update
నెటిజన్‌ చేసిన హాట్ కామెంట్‌పై షారుఖ్‌ ఖాన్‌ రియాక్షన్‌ ఇదే..!

జవాన్‌లో నీ లుక్‌ చూసి నా కొడుకు చాలా భయపడ్డాడు.. అని ఓ నెటిజన్‌ షారుఖ్‌కు ట్యాగ్ చేశాడు. దీనికి షారుఖ్ క్షమించండి.. సినిమా భయపడేంతలా ఏమీ ఉండదు. ఎప్పుడైనా అతనికి చూపించొచ్చని సూచించాడు. జవాన్‌ రోల్‌ కోసం మిమ్మల్ని మీరు ప్రిపేర్‌ చేసుకునేందుకు సినిమాలేమైనా చూశారా..? అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ.. అట్లీ డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు చూశా. ప్రపంచంలోని లాంగ్వేజ్‌లన్నింటిని అర్థం చేసుకోవడానికి విజయ్‌ సార్‌, అల్లు అర్జున్‌ జీ, రజినీ సార్‌, యశ్‌తోపాటు ఇతర స్టార్ హీరోల సినిమాలు చూశా. ఆ తర్వాత నా స్టైల్‌లో జవాన్ రోల్‌కు ప్రిపేర్‌ అయ్యానని షారుక్‌ చెప్పుకొచ్చాడు.

జవాన్ మూవీకి మీరిచ్చే నిర్వచనమేంటి..? ప్రజల సంక్షేమం కోసం వారిలో మార్పు తీసుకువస్తూ.. ఎక్కువ మందికి వినోదాన్ని అందించేదే సినిమా అని చెప్పాడు బాలీవుడ్ బాద్‌ షా. వర్క్‌లో తిరిగి జాయిన్ కావాలి. జవాన్ విడుదలకు రెడీ అవుతోంది. #AskSRK కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. ముందుగా వాగ్దానం చేసినట్టుగా ఈ సినిమా పోస్టర్‌ను లాంఛ్ చేస్తున్నా. థియేటర్లలో కలుద్దాం.. అని సెషన్‌ను ముగించాడు షారుఖ్‌ ఖాన్‌.

జవాన్‌ ట్రైలర్‌లో షారుక్‌ ఖాన్‌ కిల్లింగ్‌ యాక్టింగ్‌తో ఇరగదీశాడని, ఇంటెన్స్‌ యాక్షన్‌ పార్టు, స్టన్నింగ్ విజువల్స్‌తో సాగే ట్రైలర్‌ 2 నిమిషాల 15 సెకన్లు ఉంటుందని బీటౌన్ మీడియాలో అప్‌డేట్స్‌ రౌండప్ చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ ఈ చిత్రంలో తండ్రి, కొడుకుగా డ్యుయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. జవాన్‌లో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక రోల్‌ని పోశిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో సందడి చేయబోతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు