హీరోహీరోయిన్లు సోషల్‌మీడియాలో ఆక్టీవ్‌గా ఉంటారు. ఏ విషయాన్నైనా.. సరే.. సోషల్‌మీడియాలో రాసుకొస్తారు. అలాగే... తమకిష్టమైన వ్యక్తుల ఫోటోలు, స్థలాలను తమ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటారు. అదేవిధంగా హీరోయిన్ కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో ఓ వ్యక్తితో దిగిన ఫోటోను పెట్టి పోస్ట్ చేసింది. దీంతో ఆగ్రహించిన నెటిజన్లు నీదేం టేస్ట్ అంటూ.. తనపై విపరీతంగా ట్రోల్స్ చేస్తూ మరి మండిపడుతున్నారు.
టాలీవుడ్ మహానటి అందాల సుందరి కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో సంబంధం సెట్ అయిందని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వాటిపై కీర్తి తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యారు కూడా.. తనకు పెళ్లి చేసే సమయంలో అందరికీ చెప్పే చేస్తామని వారు తెలిపారు. ఇదే విషయాన్ని కీర్తి సురేశ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా తెలిపింది. దాంతో ఆ గొడవ సద్దుమనిగింది.
అయితే.. తాజాగా మరోసారి ఈ ఫోటో విషయంపై కీర్తి అభిమానులు మండిపడుతున్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఎవరితో అయినా ఒక్క ఫోటో దిగితే ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘భోళా శంకర్’ చిత్రం షూటింగ్ సమయంలో కీర్తి సురేష్‌తో ఒక టెక్నిషియన్ ఫోటో దిగాడని, దానిని పట్టుకుని అసభ్యంగా ప్రచారం చేయడం ఏంటని.. వారు కామెంట్ చేస్తున్నారు. మరోసారి కీర్తీ సురేష్‌పై ఇలాంటి ప్రచారాలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా పోస్ట్‌లు పెట్టే వారికి తెలుపుతున్నారు.