ఆర్‌ఆర్‌ఆర్ టీం, ఆస్కార్ గెలిచి ఏకంగా జ్యూరీ మెంబర్స్ స్థాయికి.. ఇండియన్ సినిమా స్థాయిని దర్శక ధీరుడు జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు.. ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప ఛాన్స్ ఈ మూవీకి దక్కింది. వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న ఆస్కార్స్ 96 సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సందర్భంగా 398 మంది కొత్త మెంబర్స్ ని అకాడమీ, జ్యూరీలోకి తీసుకుంది. By Shareef Pasha 29 Jun 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10,817 మంది మెంబర్స్ అకాడమి జ్యూరీ లిస్టులో ఉన్నారు. లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398 లో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. సౌత్ ఆసియా వాళ్లకి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్ లు జ్యూరీ మెంబర్స్ అవ్వడంతో ఇండియన్ మూవీ లవర్స్ మరియు మెగా - నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇండియా నుంచి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ లతో పాటు మరికొందరికి జ్యూరీ మెంబర్స్ గా చోటు లభించింది. ప్రస్తుతం ఉన్న 10,817 మందిలో 9375 మంది మాత్రమే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డ్స్ కి ఓటు వేయనున్నారు. అయితే ఈ లిస్టులో రాజమౌళి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆర్ఆర్ఆర్ సినిమా అంత దూరం వెళ్లింది అంటే జక్కన ప్లానింగ్, అలాంటిది ఆయన టీం మెంబర్స్ కి జ్యూరీలో చోటు దక్కింది కానీ జక్కన కూడా మాత్రం దక్కలేదు. ఇప్పుడే ఆస్కార్స్ లో తన ప్రయాణం మొదలు పెట్టిన రాజమౌళి, SSMB-29 సినిమాతో తన స్థాయి ఏంటో ప్రపంచానికి మరోసారి తెలియజేయనున్నాడు. ఈసారి సౌత్ ఆసియా వాళ్లకి ఎక్కువ స్థానాలు లభించాయి.ఇందులో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ లు ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్ లు జ్యూరీ మెంబర్స్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇండియా నుంచి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ లతో పాటు మరికొందరికి కూడా జ్యూరీ మెంబర్స్ గా చోటు లభించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి