Mouth Ulcers: ఈ చిన్న చిట్కాతో నోటిపూత మాయం.. అదేంటో తెలుసుకోండి! ఉప్పునీటితో మీ నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా నోటిపూత వల్ల వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కోసం తేనె లేదా కొబ్బరి నూనెను పుండుపై నేరుగా రాయవచ్చు. అంతేకాదు పుండుకు చికాకు కలిగించే యాసిడ్ ఆహారాలను నివారించండి. By Trinath 10 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మౌత్ అల్సర్స్(Mouth Ulcers) చాలా మందిని వేధిస్తుంటాయి. అనుకోకుండా మీ చెంప లోపలి భాగాన్ని కొరకడం లాంటి వాటి వల్ల కూడా ఇవి ఏర్పడవచ్చు. నోటి పూతల వల్ల చాలా నొప్పి పుడుతుంది. అసలేం తినలేం కూడా. అల్సర్ ఉన్న ప్రాంతంలో ఏది టచ్ అయినా ఫుల్‌గా నొప్పి పెడుతుంది. అసలు ఈ మౌత్ అల్సర్లు ఎందుకు సంభవిస్తాయి.. వాటిని తగ్గించుకోవడం ఎలా? ప్రతీకాత్మక చిత్రం స్పైసీ ఫుడ్స్.. పోషకాహార లోపాలు: నోటి పుండ్లు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ప్రమాదవశాత్తు నోటి లోపల భాగాన్ని కోరకడం వల్ల కూడా వస్తుంది. బ్రషింగ్ ఫస్ట్‌గా చేసినా కూడా అల్సర్‌లకు దారితీయవచ్చు. యాసిడ్ లేదా స్పైసీ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవడం వల్ల నోటిలోని సెన్సిటివ్ లైనింగ్‌కు చికాకు కలుగుతుంది. కొన్ని విటమిన్లు, ముఖ్యంగా B విటమిన్లు, ఐరన్, ఫోలేట్ లేకపోవడం అల్సర్ల అభివృద్ధికి దోహదం చేస్తుంది. హార్మోనల్ మార్పులు వల్ల కూడా నోటి పూత రావొచ్చు. ఎమోషనల్ స్ట్రెస్ లేదా యాంగ్జయిటీ వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆ సమయంలో నోరు ఎక్కువగా అల్సర్‌లకు గురవుతుంది. ఎలా తగ్గించుకోవచ్చు: ➼ ఉప్పునీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. ➼ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కోసం తేనె లేదా కొబ్బరి నూనెను పుండుపై నేరుగా రాయండి. ➼ నొప్పి ఉపశమనం కోసం డాక్టర్ చెప్పిన ఆయింట్‌మెంట్లను ఉపయోగించండి. ➼ పుండుకు చికాకు కలిగించే యాసిడ్ ఆహారాలను నివారించండి. ➼ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మంచి నోటి పరిశుభ్రతను పాటించండి. ➼ ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా తిమ్మిరి చేయడానికి మంచు చిప్స్‌ని నమలండి. పెయిన్ రిలీవర్లను తీసుకోండి. ➼ బ్రష్ చేసేటప్పుడు మరింత చికాకును నివారించడానికి మృదువైన టూత్ బ్రష్‌ను ఉపయోగించడాన్ని పరిగణించండి. ➼ మొత్తం నోటి ఆరోగ్యానికి మద్దతుగా హైడ్రేటెడ్‌గా ఉండండి. పుండు కొనసాగితే లేదా తీవ్రమవుతుంటే, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. Also Read: ‘పనికి మాలిన వ్యక్తులు..’ కలెక్టర్, సీపీపై తుమ్మల ఘాటు వ్యాఖ్యలు! WATCH: #mouth-ulcers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి