/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MOTO-G14-jpg.webp)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా(Motorola) నుంచి మోటో G14(Moto G14) ఫోన్ అందుబాటులోకి వస్తోంది. భారత మార్కెట్లోకి ఆగస్ట్ 1న లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలతో పాటు ఫోన్ స్పెసిఫికేషన్స్‌తో మరిన్ని వివరాలను ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంస్థ విడుదల చేసింది. అయితే విడుదలకు ముందే టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ భారత్‌లో ఫోన్ ధర వివరాలను లీక్ చేశారు. మొబైల్ 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే కలిగి ఉండనుంది. Unisoc T616 SoCలో రన్ కానుంది. మోటోరోలా 50MP మెయిన్ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి రానుంది.
మోటో G14 ఫోన్ ధర వివరాలను టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ట్విట్టర్‌లో లీక్ చేశారు. హ్యాండ్‌సెట్ ధర రూ. 10-11వేల లోపు ధరలో అందుబాటులో ఉండనుందని తెలిపారు. భారత మార్కెట్లో Moto G13 ఫోన్ ధర రూ. 9,999కు లభిస్తుందన్నారు. Moto G14 ఫోన్ ఆగస్టు 1న భారత్‌లో లాంచ్ అవుతుందని మోటోరోలా ధృవీకరించినట్లు వెల్లడించారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసే హైప్ క్రియేట్ చేసింది. ఈ ఫోన్ Android 13లో రన్ అవ్వడంతో పాటు Android 14కి అప్‌గ్రేడ్ కానుంది. మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభించనున్నాయి. 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి వస్తుంది. 4GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు Unisoc T616 SoCపై రన్ అవుతుంది. ప్రత్యేక స్లాట్ ద్వారా మైక్రో SD కార్డ్‌తో ఆన్‌బోర్డ్ స్టోరేజీని 1TBవరకు విస్తరించుకోవచ్చు.
50MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.20W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ గరిష్టంగా 34 గంటల టాక్ టైమ్, 94 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయం, 16 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉండనుంది. ఇన్ని ప్రత్యేకలు ఈ ఫోన్ కోసం భారత టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తక్కువ ధరకే లభించనుండడంతో అమ్మకాలు భారీగా జరిగే అవకాశం ఉంది.