Nandigama: 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తల్లి తపన.. ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే విషాదం!!

నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. పది రోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరోవైపు నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది.

Nandigama: 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తల్లి తపన.. ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే విషాదం!!
New Update
  • 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తపించి తల్లైన మహిళ
  • ఆసుపత్రిలో ముగ్గురు బిడ్డలకు జననం
  • ప్రసవం అనంతరం చికిత్స పొందుతూ మహిళ మృతి
  • తీవ్ర విషాదంలో మహిళ కుటుంబం

అమ్మా.. అనే పిలుపు కోసం ఆరాటపడని మహిళలు ఉండరు. ఆస్తుపాస్తులు లేకున్నా.. బిడ్డలుంటే చాలనుకుంటారు. ఇక బిడ్డల కోసం తిరగనా ఆస్పత్రి ఉండదు.. మొక్కని దేవుడూ ఉండడు. అలా ఓ మహిళ పిల్లల కోసం ఏకంగా 20 ఏళ్ల పాటు తపించింది. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చింది. కానీ అంతలోనే విధి కర్కశంగా కాటేసింది. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన ఆ తల్లి బిడ్డల బోసినవ్వులు కూడా చూడకుండానే.. అమ్మా అనే పిలుపు వినకుండానే తనువు చాలించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా నందిగామ మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు:

పది రోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడంతో నజీరాతో పాటు కుటుంబ సభ్యుల ఆనందం అంబరాన్నంటింది. ముగ్గురు శిశువులు ఆరోగ్యంతో ఉన్నారు.

రక్తం తక్కువగా ఉండటంతో..

మరోవైపు నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది. పిలల్ల కోసం తపించిన ఆమె వారిని కళ్లారా చూసుకోకుండానే కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. నజీరా మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. బుధవారం కుటుంబసభ్యుల రోదనల నడుమ ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. తన స్థాయికి మించి ఖర్చు చేసినా బిడ్డలు తల్లిలేని వారు కావడంతో ఖాసిం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాడు.

#krishna-district #nandigama #mother-died #giving-birth-to-three-children #three-children
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe