ఈ జీవులకు ఆకలేస్తే తమ పిల్లలనే తింటాయట.. శాస్త్రవేత్తలు చెప్పిన ఆసక్తికర విషయాలివే

జీవ శాస్త్రవేత్తలు రీసెంట్ గా చేసిన ఓ అధ్యయనం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భూమి మీద జీవించే అనేక జంతు, జీవాలు మనుషుల వలే తమ సంతానాన్ని సంరక్షిస్తాయి. కానీ కొన్ని మాత్రం వాటి పిల్లల్ని అవే తింటాయని, ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికి వాస్తవమని తెలిపారు.

New Update
ఈ జీవులకు ఆకలేస్తే తమ పిల్లలనే తింటాయట.. శాస్త్రవేత్తలు చెప్పిన ఆసక్తికర విషయాలివే

ఈ భూమి మీద బతికే ఏ ప్రాణి అయినా తమకు పుట్టిన సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తమ పిల్లలకు రెక్కలొచ్చి సొంతంగా జీవించగలిగినా సరే ఎల్లప్పుడూ అనుకోకుండా వచ్చే విపత్తులు, ప్రమాదాలనుంచి సంరక్షించేందుకు ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇటీవల ఓ అధయ్యనం ప్రకారం కొన్ని జంతువులు మాత్రం వాటి పిల్లల్ని అవే తింటున్నట్లు జీవ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా మనమధ్యే జీవించే కొన్ని జీవజాతులుండటం విశేషంగా పేర్కొన్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

* ఎలుకలు
సాధారణంగా ఇవి పొలాలు, అడవుల్లోనే కాకుండా మనుషులతోపాటు జీవిస్తాయి. అయితే ఆడ ఎలుకలు తీవ్రమైన ఒత్తిడికి గురైనపుడు వాటి పిల్లలనే తింటాయట. ముఖ్యంగా పిల్లలు చనిపోయి లేదా బలహీనంగా ఉన్నప్పుడు మిగతా వాటి కంటపడకముందే వాటి సంతానాన్ని తినేస్తాయి.అలాగే చిట్టెలుక.. తల్లులు తమ పిల్లలు కరిసే విదంగా ప్రవర్తించినా లేదా పిల్లలు అనారోగ్యంగా కనిపించిన వెంటనే ఆరగించేస్తాయి.

* సింహం
పిల్లల్ని చంపుకొని తినే జంతువుల్లో మృగరాజు కూడా ఒకటి. ముఖ్యంగా మగ సింహాలు ఆధిపత్యాన్ని స్థాపించడానికి పిల్లలను చంపేస్తాయంటున్నారు నిపుణులు. మందలో కొత్త మగ సింహం పుడితే అది సంతానోత్పత్తి చేసే భాగస్వామిని దొంగిలించవచ్చు లేదా భూభాగాన్ని ఆక్రమిస్తాయనే భయంతో మగ సింహాలు పిల్ల సింహాలను చంపేస్తాయి.

* ధృవపు ఎలుగుబంటి

ఇవి ఆహారం కోసం పోరాటం చేసి చేసి ఎక్కడ ఏమీ దొరకకపోతే చివరికి విసుగు చెంది తమ పిల్లలను అవే చంపుకు తింటాయి. అరుదైన సందర్భాల్లో, మగ ధృవపు ఎలుగుబంట్లు పిల్లలను కూడా చంపి తింటాయి.

* గోల్డెన్ ఈగిల్
కొన్ని సందర్భాల్లో, గోల్డెన్ డేగ తల్లిదండ్రులు ఆహారం తక్కువగా ఉన్నప్పుడు తమ సొంత పిల్లలను తినేస్తుంటాయి.

* మచ్చల హైనాలు
దుమ్ములగొండి ఇగ్లీష్ లో హైనా ఒక రకమైన మాంసాహారి అయిన క్షీరదము. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి చారల హైనా , బ్రౌన్ హైనా, మచ్చల హైనా , ఆర్డ్‌వుల్ఫ్ . ఇందులో అతి ప్రమాదకరమైనది చుక్కల హైనా . ఇవి చుక్కల హైనాలు వంశంలో తక్కువ స్థాయి ఆడపిల్లల పిల్లలను చంపి తింటాయి.

* బ్లాక్ విడో స్పైడర్
ఆడ నల్ల సాలెపురుగులు తమ మగ సాలెపురుగులను అలాగే అప్పుడప్పుడు ఆహారం తక్కువగా ఉంటే వాటి స్వంత సాలెపురుగులను తింటాయి.

* ప్రేయింగ్ మాంటిస్
ఆడ మాంటిస్‌లు కొన్నిసార్లు సంభోగం తర్వాత మగపిల్లలను తింటాయి. అలాగే ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు వాటి స్వంత గుడ్లను కూడా తినేస్తుంటాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు