Maoist Bicchu: లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ "బిచ్చు"

మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్‌చార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు ఈరోజు డిప్యూటీ సీఎం, పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగి పోయింది.

New Update
Maoist Bicchu: లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ "బిచ్చు"

Maoist Bicchu: మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్‌చార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు ఈరోజు డిప్యూటీ సీఎం, పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగి పోయింది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షం లో లొంగిపోయారు. బిచ్చు లొంగుబాటుతో గడ్చిరౌలి జిల్లాతో పాటు మధ్య భారత్‌లోని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్టయిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గిరిధర్ తుమ్రెట్టి 86 ఎన్‌కౌంటర్లు, 15 కాల్పుల ఘటనలో క్రియాశీలక పాత్ర పోషించాడు. బిచ్చుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనలో పాల్గొన్నందుకు 179 కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధా రిగా వ్యవహరించాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు