Dawood in Hospital: హాస్పిటల్లో చావు బతుకుల మధ్య దావూద్? విషప్రయోగమే కారణమా!

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ లోని కరాచీలో ఒక ఆసుపత్రిలో దావూద్ కు చికిత్స నిర్వహిస్తున్నారని అంటున్నారు. అయితే, దీనిపై ఎక్కడా అధికారికంగా ధ్రువీకరణ రాలేదు

Dawood Ibrahim:  ముస్లింల కోసం దావూద్ చాలా చేశాడు..అండర్ వరల్డ్ డాన్‌పై స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!
New Update

Dawood in Hospital: మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చేరాడు. దావూద్ పై విషప్రయోగం చేసినట్లు భావిస్తున్నారు. అయితే, దీనిని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. దావూద్  చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్నాడు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, అతను ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది.  భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో దావూద్ ఉన్నాడు. 1993లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇతను వాంటెడ్ గా ఉన్నాడు.

అయితే, దావూద్ ఇబ్రహీం(Dawood in Hospital) కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు పాక్ ధ్రువీకరించలేదు.  విషప్రయోగం కారణంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడికి విషం ఇచ్చిందెవరన్న సమాచారం లేదు.

నిజానికి, భారతదేశం మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood in Hospital) గురించి అనేక రకాల నివేదికలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విషప్రయోగం కారణంగా దావూద్ ఇబ్రహీం కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దావూద్ ఇబ్రహీం ముంబైలో పుట్టి మురికివాడలో పెరిగాడు.అతని తండ్రి పోలీసు కానిస్టేబుల్. దావూద్  చిన్నతనంలోనే దొంగతనాలు, దోపిడీలు మొదలైనవాటిలో చిక్కుకున్నాడు.

దావూద్ పై విషప్రయోగం జరగడానికి వెనుక ఉన్న కారణాలపై చాలారకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా కారైకాలాపాలకు పాల్పడుతూ పాకిస్తాన్ లో ఉన్న వారిపై చ్చర్యలు తీసుకోవాలని పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఈ సంఘటనను బలపరుస్తూ.. ఇటీవల  లష్కరే తోయిబా కమాండర్ అద్నాన్ అహ్మద్ అలియాస్ అబు హంజాలాతో సహా అనేక మంది వాంటెడ్ ఉగ్రవాదులు వివిధ నగరాల్లో హతమవడం కూడా నిలుస్తోంది. 

పాకిస్థాన్ నుంచి అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి సమాచారం లేదు. అయితే, దావూద్ ఆసుపత్రిలో ఉన్నాడని ఇండియా టుడే ఒక కథనం ప్రచురించింది. దానిప్రకారం.. దావూద్‌ను ఉంచిన ఫ్లోర్‌లోని ఆసుపత్రిలో మరో రోగి లేడు. అతని కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడికి వెళ్లగలరు. ఈ విషయంపై ముంబై పోలీసులు కూడా ఓ కన్నేసి ఉంచారు. ముంబైలోని దావూద్ బంధువుల నుంచి ఇన్‌పుట్‌లను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే, ఇవి వదంతులే అని కొన్ని వర్గాలు అంటున్నాయి. కానీ, స్థానిక రిపోర్ట్రర్స్ సోషల్ మీడియాలో ఇస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఎక్స్, గూగుల్ సర్వీసెస్ లేదా యూట్యూబ్ అన్నింటిని నిలిపివేశారు. వీటి సర్వర్ లను డౌన్ చేశారు.   ఈ సమయంలో పాకిస్తాన్‌లో X ఓపెన్ కావడంలేదు.  లేదా పాకిస్తాన్‌లో Google సేవలు అందుబాటులో లేవు. అలాగే, YouTube పని చేయడం లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ సేవలు ఎందుకు నిలిచిపోయాయి? ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతోందని, దానిని దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ అంటున్నారు.

Also Read: వివేకా హత్య కేసులో మరో సంచలన మలుపు.. సునీతతో పాటు వారిపై పులివెందులలో కేసు

గతంలోనూ..

గతంలో దావూద్‌కు సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది.  అందులో అతను ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. గ్రీన్ రావడంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో అతని రెండు కాలి వేళ్లు తెగిపోయాయి. అయితే, అప్పుడు ఈ పరిస్థితిని అతని సన్నిహితుడు ఛోటా షకీల్ తీవ్రంగా ఖండించారు.

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.ఈ దాడిలో 250 మందికి పైగా మరణించారు.  వేలాది మంది గాయపడ్డారు. దావూద్ ఇబ్రహీం కరాచీలోని నాగరిక ప్రాంతమైన క్లిఫ్టన్‌లో నివసిస్తున్నాడని తాము నమ్ముతున్నామని భారత అధికారులు తరచూ చెబుతూనే ఉన్నారు.  అయితే పాకిస్థాన్ దీనిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. జనవరి 2023లో దావూద్ మేనల్లుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి దావూద్ పాకిస్థాన్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడని, తన కుటుంబంతో కలిసి కరాచీలో నివసిస్తున్నాడని చెప్పాడు.

దావూద్‌కు సంబంధించిన 10 ప్రత్యేక విషయాలు

  • యుక్తవయసులో నేర ప్రపంచంలోకి ప్రవేశించాడు 
  • గ్యాంగ్‌స్టర్ షబీర్ ఇబ్రహీం కస్కర్ అన్నయ్య.
  • ముంబైకి చెందిన అత్యంత పేరుమోసిన అండర్ వరల్డ్ కింగ్‌పిన్
  • అల్‌ఖైదా, లష్కర్‌లతోనూ సంబంధాలు ఉన్నాయి.
  • 1993 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతిపెద్ద నిందితుడు
  • ఛోటా రాజన్‌ను ఒకప్పుడు అతని కుడి భుజంగా పిలిచేవారు
  • ప్రపంచంలోని FBI టాప్ 10 వాంటెడ్ లిస్ట్‌లో నంబర్-3
  • అతను - అతని అనుచరులు రియల్ ఎస్టేట్‌లో చాలా డబ్బు పెట్టుబడి పెట్టారు
  • అన్ని పెద్ద హవాలా వ్యాపారాల్లో హస్తం ఉంది
  • బాలీవుడ్ నిర్మాతలు, సెలబ్రిటీల నుంచి దోపిడీ

Watch this interesting Video:

#pakistan #dawood-ibrahim
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe