Jhanvi Kapoor: కళ్లు బాగున్నాయంటూనే నా వక్షోజాలను చూస్తారు.. జాన్వీ బోల్డ్ కామెంట్స్

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓపెన్ అయింది. అందరూ నా కళ్లు బాగున్నాయని అంటుంటారు. కానీ ఎక్కుమంది నా వక్షోజాలను మాత్రమే ప్రత్యేకంగా చూస్తారంటూ రీసెంట్ ఇంటర్వూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

New Update
Jhanvi Kapoor: కళ్లు బాగున్నాయంటూనే నా వక్షోజాలను చూస్తారు.. జాన్వీ బోల్డ్ కామెంట్స్

Jhanvi Kapoor: బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ మరోసారి బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బొద్దు గుమ్మ.. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తోంది. అయితే ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) నిర్వహిస్తున్న టాక్ షో 'కాఫీ విత్ కరణ్' (Koffe With Karan) లేటెస్ట్ ఎపిసోడ్ కు హాజరైన జాన్వీ.. అమ్మ, ఫ్యామిలీతో అనుబంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. అలాగే తనకు ఎదురైన చేదు అనుభాల గురించి కూడా ఓపెన్ అయింది.

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

తల్లి జ్ఞాపకాలు..
ఈ మేరకు హోస్ట్ కరణ్ జోహార్ అక్కాచెల్లెళ్లు, బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్, కపూర్ ఫ్యామిలీ గాసిప్స్ గురించి పలు పశ్నలు అడిగారు. దీంతో మొదట తన తల్లి శ్రీదేవితో ముడిపడిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఆమె చనిపోయిన సందర్భాలు గుర్తొస్తే గుండె పగిలినంత పనైపోతుందని, ఇప్పటికీ ఆ బాధనుంచి కోలుకోలేకపోతున్నామంటూ గతాన్ని తలచుకుంటూ బాధపడింది.

ఇది కూడా చదవండి : Niharika: మెగా డాటర్ నిహారిక జాతకంపై ఇంట్రెస్టింగ్ చర్చ.. సోషల్ మీడియాలో రచ్చ

చేదు అనుభవాలు..
అలాగే పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్లినప్పుడు ఎదురయ్యే అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘నిజానికి అందరూ నా కళ్లు బాగున్నాయని అంటుంటారు. కానీ ఎక్కుమంది నా వక్షోజాలను మాత్రమే ప్రత్యేకంగా చూస్తారు. ఈ విషయం నేను చాలా చోట్ల గమనించాను' అంటూ ఓపెన్ గా చెప్పేస్తూనే ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్, వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తూ నటిని పొగిడేస్తున్నారు. అందం ఉన్నప్పుడు దాచుకోవడం ఎందుకంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'దేవర' సినిమాతో (Devara Movie) టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది జాన్వీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, జాన్వీ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సమ్మర్ స్పెషల్‌గా మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు