Most Expensive Divorce :పెళ్లంటే (Marriage) నూరేళ్ల పంట..! ఇద్దరు కలిసిమెలసి అన్యోన్యంగా జీవించడమే వివాహానికి నిజమైన అర్థం. కొంతమంది తమ స్థోమతను బట్టి ఘనంగా పెళ్ళి చేసుకుంటే.. ఇంకొంతమంది తమ తాహతును బట్టి చేసుకుంటారు. అయితే కొంతమంది దంపతులు పెళ్లిళ్ల విషయంలోనే కాదు.. విడాకులలోనూ ఖరీదైన వ్యక్తులుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇక కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) విడాకుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీ ఇవ్వాలని.. పిల్లల చదువులు కూడా శ్రీనివాస్ చూసుకోవాలని భార్య వాణీ చెబుతున్నారు. దీంతో ఇది ఖరీదైన విడాకుల వ్యవహారంగా నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకుల గురించి ప్రజలు ఫ్లాష్‌బ్యాక్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos), మెకంజీ స్కాట్‌ల విడాకుల (Divorce) వ్యవహారం అత్యంత ఖరీదైనది. 25ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరూ 2019లో డివోర్స్ తీసుకున్నారు. అటు భరణం కింద స్కాట్‌కు అమెజాన్‌లో 4 శాతం వాటా దక్కింది. మొత్తంగా బెజోస్ నుంచి స్కాట్‌కు దాదాపు 3 లక్షల కోట్లు లభించాయి.
మైక్రోసాఫ్ట్ కోఫౌండర్, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates), మెలిందాది కూడా అత్యంత ఖరీదైన విడాకుల జాబితాలో ఉంది. బిల్ గేట్స్ మెలిందాకు 6 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. దీంతో ప్రపంచంలోని అత్యంత విడాకులు భరణం తీసుకున్న మహిళల్లో మిలిందా ఒకరిగా నిలిచారు.
అటు బిల్ గేట్స్, మిలిందా దంపతులే కాదు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రిషీద్, తన మాజీ భార్య జోర్డాన్ రాకుమారి హయా హుస్సేన్‌కు రూ. 5,555కోట్లు భరణంగా చెల్లించారు. ఇది బ్రిటిష్ చరిత్రలో అత్యంత ఖరీదైనది. అటు ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ ఎలిన్ నుంచి 2010లో విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల విలువ దాదాపు 6 వేల కోట్లు.
ఇక కొందరు సెలబ్రెటీలు మాత్రం ఎలాంటి భరణం లేకుండా విడాకులు తీసుకున్నారు. ఇటు 2017లో నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. అయితే విడాకుల సమయంలో సమంత 200 కోట్ల రూపాయలు భరణం అడిగారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సమంత అసలు ఒక్క రూపాయి కూడా భరణం కింద తీసుకోలేదని సమాచారం.
మరోవైపు పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీతో పాటు.. టెక్కలి, వెంకటేశ్వర కాలనీలోని 6 కోట్ల విలువైన పాత ఇంటిని తనకు ఇవ్వాలని వాణి అడుగుతున్నారు. పిల్లల చదువులు, వారి మెయింటెనెన్స్ శ్రీనివాస్ చూసుకోవాలని చెబుతున్నారు. విడాకుల అంశాన్ని సామరస్యంగా కోర్టులో పరిష్కరించుకుందామంటున్నారు. కొత్త ఇంటిని ఇవ్వాలని వాణి డిమాండ్ చేస్తుండగా.. దీనికి శ్రీనివాస్ అంగీకరించడంలేదు.
Also Read : అడ్జస్ట్‌మెంట్, కాంప్రమైజ్ అక్కడ కామన్.. అందరూ కాంతదాసులే!