మస్తుగా తిన్నారు..సెకనుకో బిర్యానీ ఆర్డర్ చేసిన నగరవాసులు..!!

జూలై 2 (సోమవారం) ప్రపంచ బిర్యానీ దినోత్సవం. బిర్యానీ అనగానే ఠక్కున గుర్తుకువచ్చేది హైదరాబాద్. బిర్యానీ రాజధానిగా హైదరాబాద్ కు పేరుంది. దేశ వ్యాప్తంగానే కాదు...ఇతర దేశాల్లోనూ హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. హైదరాబాద్ వచ్చినవారు బిర్యానీ తినకుండా వెళ్లలేరు. అయితే బిర్యానీ పట్ల హైదరాబాదీలకు ఉన్న మక్కువ గురించి మరోసారి తేలిపోయింది. గడిచిన ఆరునెలల్లో 72లక్షలకు పైగా బిర్యానీలు లాంగిచేశారట నగరవాసులు.

మస్తుగా తిన్నారు..సెకనుకో  బిర్యానీ ఆర్డర్ చేసిన నగరవాసులు..!!
New Update

హైదరాబాద్ బిర్యానీ...దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. దీనిని ప్రపంచంలోని ప్రసిద్ధ వంటకాల్లోనూ చేర్చారు. హైదరాబాద్ కు వచ్చినవారు ఎన్ని పనులున్నా సరే..వాటిని పక్కన పెట్టి బిర్యానీ తిన్న తర్వాతే మిగతా పనులు చూస్తుంటారు. నగరంలో లభించే బిర్యానీ రుచి మరెక్కడా ఉండదు. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ బిర్యానీ రోజురోజూ చాలా ఫేమస్ అవుతోంది. తాజాగా ఓ సర్వే ప్రకారం...జంటనగరవాసులు ఆరు నెలల్లోనే 72లక్షలకు పైగా బిర్యానీలు లాంగించేసినట్లు తేలింది.

hyderabad biryani

బిర్యానీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ సంచలన విషయాలను బయటపెట్టింది. దేశ వ్యాప్తంగా ప్రతి ఐదు ఆర్డర్ లలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఉండటం విశేషం. వీటిలో దాదాపు తొమ్మిది లక్షల ఆర్డర్ లతో ధమ్ బిర్యానీ మొదటిస్థానంలో నిలిచింది. బిర్యానీ రైస్ కు 7.9లక్షల మంది ఆర్డర్లు ఇచ్చారట. ఇతర బిర్యానీలకు 5.2లక్షల మంది ఆర్డర్ చేశారని తేలింది.

కాగా హైదరాబాద్ నగరంలో దాదాపు 15,000లకు పైగా రెస్టారెంట్లు బిర్యానీ అందిస్తున్నాయి. ముఖ్యంగా కూకట్ పల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, కొత్తపేట, దిల్ షుక్ నగర్, అమీర్ పేట, సికింద్రాబాద్ లలో బిర్యానీ రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ధమ్ బిర్యానీకి కూకట్ పల్లి చాలా ఫేమస్ అని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత స్థానాల్లో మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ఉన్నాయి. అయితే బిర్యానీ ఆర్డర్ల కోసం ప్రత్యేక రెస్టారెంట్లను మాత్రమే రెఫర్ చెస్తున్నారు కస్టమర్లు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe