Money Ideas : తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు..లక్షకు రెండు లక్షలు...బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ ఇవే..!!

కిసాన్ వికాస్ పత్ర స్కీంలో రూ. 1000 ఇన్వెస్ట్ మెంట్ చేస్తే 7.5శాతం వడ్డీ రేటుతో మీ పెట్టుబడిని 115 నెలల్లోనే రెండింతలు చేస్తుంది. సిప్ తో పెట్టుబడులపై మార్కెట్ లింక్డ్ గ్రోత్ పొందవచ్చు. లక్షపెట్టుబడి 6ఏళ్లలో రూ.1,97,382 లేదా 7ఏళ్లలో రూ.2,21,068కి పెరుగుతుంది.

New Update
Money Ideas : తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు..లక్షకు రెండు లక్షలు...బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ ఇవే..!!

Money Ideas :  డబ్బుపై పెట్టుబడులు పెట్టేందుకు మార్కెట్లో ఇన్నో స్కీంలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది బెస్ట్ స్కీమ్స్(Best schemes), డబ్బును రెట్టింపు చేసే ఛాన్స్ ఉన్న ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్(Investment Options) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కిసాన్ వికాస్ పత్ర:
డబ్బును రెట్టింపు చేసుకోవాలని కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్ కిసాన్ వికాస్ పత్ర(Kisan Vikas Patra). ఇందులో మినిమం ఇన్వెస్ట్ మెంట్ రూ. 1000. ఈ స్కీం ద్వారా 7.5శాతం వడ్డీ రేటుతో మీ పెట్టుబడిని కేవలం 115నెలల్లో రెండింతలు చేస్తుంది. ఈ స్కీంలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు కూడా ఒపెన్ చేసుకోవచ్చు. సింగిల్ లేదా జయింట్ అకౌంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

సిప్:
సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (Systematic Investment Plan)తో పెట్టుబడులపై మార్కెట్ లింక్డ్ గ్రోత్ ను పొందవచ్చు. మీ డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందని సిప్ హమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాటి చారిత్రక పనితీరు ఆధారంగా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ఈమధ్య కాలంలో యావరేజ్ గా 12శాతం రిటర్న్స్ లభించాయి. అంటే రూ. 1,00,000పెట్టుబడి పెడితే 6ఏళ్లలో రూ. 1.97.382 లేదా 7ఏళ్లలో రూ. 2.21.068కి పెరుగుతుంది. ప్రతినెలా రూ. 2000సిప్ చేస్తే పదేళ్లలో సుమారు రూ. 4.64.678 అవుతుంది.

పోస్టాఫీస్ ఫిక్స్ డ్ డిపాజిట్:
నమ్మకమైన పెట్టుబడి కోసం నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ గా పేర్కొనే పోస్టాఫీస్ ఫిక్స్ డ్ డిపాజిట్(Post Office Fixed Deposit) ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. మీ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు ఐదేళ్లు పెట్టుబడి పెట్టండి. మరో ఐదేళ్ల వరకు ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. మొత్తం 10ఏళ్ల తర్వాత మీరు చేసిన పెట్టుబడి మొత్తం రెట్టింపు అవుతుంది. మొదట రూ. 1లక్షపెట్టుబడి పెడితే పదేళ్లకు రూ. 2,10,235 అవుతుంది.

మీరు ఈ ఏడాదిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసినట్లయితే...మీ రిస్క్ టాలరెన్స్ , ఆర్ధిక లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలను పరిగణలోనికి తీసుకోండి. పోస్టాఫీసు ఫిక్స్డ్ డిపాజిట్ కిసాన్ వికాస్ పత్ర, సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ వంటి స్కీములను డైవర్సిఫై చేయడం వల్ల బ్యాలెన్స్డ్ అప్రోచ్ లభిస్తుంది. గ్యారంటీడ్ రిటర్న్స్ మార్కెట్ లింక్డ్ గ్రోత్ రెండింటి నుంచి ప్రయోజనాలను పొందవచ్చు.

ఇది కూడా చదవండి : మాల్స్ లో పార్క్ చేసిన కారును గుర్తించే అద్భుత ఫీచర్..ఇదే..!!

Advertisment
తాజా కథనాలు