ఉద్దృతంగా ప్రవహిస్తున్న మూసీ..నిండుకుండలా జంటజలాశయాలు!

జోరుగా కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా దంచుతున్న వానలతో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ కు వరద ఉద్దృతి పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ ఒకటి, రెండు గేట్లు ఎత్తితే మాత్రం మూసీ నదికి మరింత ఉద్ధృతి పెరగనుంది.మరో వైపు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరుగుతూ పోతుంది. దీంతో దిగువన ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఉద్దృతంగా ప్రవహిస్తున్న మూసీ..నిండుకుండలా జంటజలాశయాలు!
New Update

జోరుగా కురుస్తున్న వర్షాలతో జంటజలాశయాలు నిండుకుండలా మారాయి. ఎడతెరిపి లేకుండా దంచుతున్న వానలతో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ కు వరద ఉద్దృతి పెరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఉస్మాన్ సాగర్ కు ఇన్ ఫ్లో పెరుగుతుంటే.. ఇప్పటికే హిమాయత్ సాగర్ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరటంతో కేవలం రెండు గేట్లను రెండడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు పెరుగుతున్న నీటి ఉద్దృతిని బట్టి అదనంగా మరో రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Moose is flowing fiercely.. The twin reservoirs are full!

ఇక సోమవారం ఉదయం వరకు ఉస్మాన్ సాగర్ కు కూడా కేవలం 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, మధ్యాహ్ననానికి ఇన్ ఫ్లో కాస్త 1100 క్యూసెక్కులకు పెరిగింది. ఇలాగే ఇన్ ఫ్లో కొనసాగితే మాత్రం బుధవారం ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 2750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున, ఒకవేళ ఉస్మాన్ సాగర్ ఒకటి, రెండు గేట్లు ఎత్తితే మాత్రం మూసీ నదికి మరింత ఉద్ధృతి పెరగనుంది. అయితే ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1786.55 అడుగులకు పెరిగింది.

ఇన్ ఫ్లో ఒక్కసారిగా 1100 క్యూసెక్కులకు పెరిగినా, ఇంకా అవుట్ ఫ్లో రిలీజ్ చేయలేదు. ఇక హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.75 అడుగులకు చేరి, 2500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తుండడంతో మధ్యాహ్నం మరో రెండు గేట్లను రెండడుగుల ఎత్తు వరకు ఎత్తాల్సి వచ్చింది. మరో వైపు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరుగుతూ పోతుంది. దీంతో దిగువన ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe