పొడి దగ్గు వేధిస్తోందా? ఈ చిన్న చిట్కాతో మీ సమస్య తీరిపోయినట్టే..!

వర్షాకాలంలో చాలా మందిని పొడి దగ్గు వేధిస్తుంటుంది. అయితే అల్లం, ఆవిరి, ఉప్పు, తులసి ఆకులు, పసుపు లాంటి ఇంటి చిట్కాలతో మీ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

New Update
పొడి దగ్గు వేధిస్తోందా? ఈ చిన్న చిట్కాతో మీ సమస్య తీరిపోయినట్టే..!

వర్షాకాలం వచ్చిందంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు పలకరిస్తుంటాయి. వీటిలో ఒకటి పొడి దగ్గు(Dry cough). ఈ సీజన్‌లో జలుబు(cold), దగ్గు(cough) లాంటి సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి. ఈ సమస్యలు త్వరగా తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుంటాయి. ఫ్లూ(flu), ఆస్తమా(asthma) వల్ల కూడా పొడి దగ్గు సమస్య వస్తుంది. సిగరెట్ ఎక్కువగా తాగే వారితో పాటు ఇతర హెల్త్ ప్రాబ్లెమ్స్(health problems) వల్ల కూడా పొడి దగ్గు సమస్య తీవ్రమవుతుంది. అయితే మనం ఇంటి చిట్కాల(home remedies)తోనే ఈ పొడి దగ్గు సమస్యను దూరం చేసుకోవచ్చు.

వర్షాకాలంలో పొడి దగ్గు కోసం 7 ఇంటి చిట్కాలు:

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

తేనె:
తేనె(honey)తో చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించే అనేక యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడి దగ్గుకు చికిత్స చేయడానికి వెచ్చని నీరు, తేనెను కలపి తాగవచ్చు.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

వెల్లుల్లి (garlic):
యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా వెల్లుల్లి దగ్గు, జలుబు లాంటి వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

అల్లం (ginger):
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసనాళాల్లోని పొరలను సడలించడంతోపాటు దగ్గును తగ్గిస్తాయి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. కఫం ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

పసుపు (turmeric):
ప్రతి ఇంటిలో పసుపు ఉంటుంది. ఇది యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు శ్వాసకోశ మందులను రూపొందించడానికి పసుపును ఉపయోగిస్తారు.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

తులసి ఆకులు (basil leaves):
దీర్ఘకాలిక దగ్గును అంతం చేసే అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని నమలడం వల్ల మీ దగ్గును నియంత్రించవచ్చు.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

ఉప్పు (salt):
ఉప్పులోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు శ్లేష్మాన్ని(mucus) క్లియర్ చేయడం లేదా తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో గొంతు నొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రతిరోజూ కనీసం రెండుసార్లు, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పుతో పుక్కిలించండి.

ఆవిరి:
ఆవిరి దగ్గుని తగ్గిస్తుంది. ముక్కును క్లీన్‌ చేయడానికి కూడా ఆవిరి పట్టవచ్చు. కనీసం 10నిమిషాల పాటు ఒక టవల్‌ లేదా దుప్పటితో బాడీ మొత్తాన్ని కప్పేసుకోని ఆవిరి పట్టండి.

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు