వర్షాలు పడుతున్నాయని వేడివేడి బజ్జీలు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ బాధితులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్‌ని అవైడ్‌ చేయాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. మీ కళ్లను, పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

New Update
వర్షాలు పడుతున్నాయని వేడివేడి బజ్జీలు తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి

అప్పటివరకు భగభగ మండే ఎండల నుంచి.. ఉపశమనాన్ని ఇచ్చేందుకు వానకాలం(rainy season) వస్తుంది.. వచ్చిరావడంతోనే మనసుకు కాస్త రిలాక్సెషన్‌ ఇస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్ని చోట్ల బీభత్సం సృష్టిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులతో పలకరిస్తున్నాడు. దీంతో సాయంత్రం అవ్వగానే వేడివేడి ఫుడ్‌ ఐటెమ్స్‌ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేడివేడిగా బజ్జీలు తినేవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ ఘాటును ఇష్టపడతారు. అయితే ఓ పరిమితిలో తింటే ఏం కాదులే కానీ.. లిమిట్‌ దాటి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా డయాబెటిస్‌(diabetes) ఉన్నవాళ్లకి షుగర్‌ లెవల్స్‌ పెరిగే ప్రమాదముంటుంది. అలాంటి వాళ్లు ఏం చేయాలి?

వర్షాకాలంలో మీ మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి?:

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

① మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోండి:
మీకు డయాబెటిస్‌ ఉంటే.. మీ పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. కాలుకు తగిలే చిన్న దెబ్బ కూడా హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. హై బ్లడ్ షుగర్‌ లెవల్స్‌ ఫలితంగా రక్త ప్రసరణ బలహీనపడుతుంది. ఫలితంగా మీ పాదంలోని నరాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని న్యూరోపతి అంటారు.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

② మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోండి:
వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా సంభవిస్తాయి. కంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి, మీ చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. చేతిలో మీ కళ్లను పదేపదే తాకకుండా ఉండండి.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

③ హైడ్రేషన్ కీలకం:
వర్షాకాలంలో మంచినీళ్లు తాగడం తగ్గిస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇలా వాటర్‌ని తాగడం తగ్గించడం వల్లన మీ శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండకపోవచ్చు. డయాబెటిస్‌ వ్యాధి ఉన్నవాళ్లు తాగడానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి. నీటి స్థానంలో కొబ్బరి నీళ్లను కూడా తాగవచ్చు.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

④ రెగ్యులర్ వ్యాయామం:
వర్షాకాలంలో..చాలా మందికి బద్దకం పుడుతుంది. ఎక్కువ సమయం బెడ్‌పై నుంచి లెగబుద్ధి కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.. చురుకుగా ఉండాలి. ఇది రక్తంలో షూగర్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

⑤ ఆరోగ్యకరమైన భోజనం తినండి:
డయాబెటిస్‌ బాధితులు వర్షాకాలంలో ఆహార ఎంపికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి. మీ రోగనిరోధక శక్తికి సహాయపడే వాటిని ఎంచుకొని తినండి.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

⑥ జంగ్‌ఫుడ్ వద్దు:
వెదర్‌ కూల్‌కూల్‌గా ఉంది కదా అని వేడివేడి పదార్థాల జోలికి పోవద్దు. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తింటే మీ షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. అటు బజ్జీలతో పాటు నూనెతో చేసే ఫుడ్‌ ఐటెమ్స్‌కి దూరంగా ఉండాలి. మీ కళ్ళను, పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు