Money Flood: రూ.8 కోట్ల నోట్ల కట్టల వర్షం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?

హెలికాఫ్టర్‌ నుంచి ఓ కంటైనర్‌ ద్వారా నోట్ల కట్టల వరదను పారించాడు ఓ టీవీ హోస్ట్. ఏకంగా రూ. 8 కోట్ల రూపాయలను హెలికాఫ్టర్‌కి వేలాడదీసిన ఓ కంటైనర్‌ నుంచి జారవిడిచాడు. దాదాపు 4 వేల మంది ఈ డబ్బు కోసం ఎగబడ్డారు. ఈ ఘటన యూరోపియన్‌ దేశమైన చెక్‌ రిపబ్లిక్‌లో జరిగింది. ఆ టీవీ హోస్ట్ ఎందుకలా చేశాడు..?

Money Flood:  రూ.8 కోట్ల నోట్ల కట్టల వర్షం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?
New Update

అది చెక్‌ రిపబ్లిక్‌(Czech Republic)లోని ఓ ప్రాంతం.. అంతా ఓ గ్రౌండ్‌కు చేరుకున్నారు.. వేల మంది అక్కడే నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. కెమెరాలన్ని అక్కడ నిలపడి ఉన్నవారివైపే ఫోకస్‌ చేసి ఉన్నాయి. పై నుంచి దేవుడు ఏమైనా వస్తున్నాడా అని అనుమానం కలిగిలే వారి ఎదురుచూపులు కొనసాగాయి. అందరిలోనూ ఒక్కటే ఆనందం.. కాస్త టెన్షన్.. అక్కడ ఏం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు తెలుసు.. కానీ ప్రపంచానికి తెలియదు. వీడియో చూస్తున్న వాళ్లకి చాలా సేపు అర్థంకాలేదు.. ఆకాశంవైపు ఎందుకుచూస్తున్నారా అని. ఇంతలోనే ఛఫ్‌ఫ్‌ఫ్‌ఫ్‌(chuff) అంటూ సౌండ్‌ వినపడింది. అందరూ ఒక్కసారిగా కళ్లు పెద్దవి చేశారు. గ్రౌండ్‌ చుట్టుపక్కల ఉన్న చెట్లు గాలికి ఊగిపోతున్నాయి. హెలికాఫ్టర్ వస్తుంటే అలానే ఉంటుంది కదా. హెలికాఫ్టర్‌ నుంచి వేలాడుతూ కంటైనర్‌ కనిపిస్తోంది. అందరూ ఆ కంటైనర్‌ వైపే చూస్తున్నారు. సడన్‌గా ఆ కంటైనర్‌ తెరుచుకుంది. అందులో నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది. డబ్బులు తీసుకునేందుకు ఎగబడ్డారు.


నోట్ల కట్టలు జారవిడిచింది ఎవరు?
ఇది నోట్ల కట్టల వర్షం కాదు.. నోట్ల వరదే.. కాదు కాదు.. నోట్ల సునామీ.. ఒకటి రెండు లక్షల రూపాయలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలను హెలికాఫ్టర్‌ కంటైనర్‌ నుంచి ఓ వ్యక్తి జారవిడిచాడు. అవి అక్షరాల 8 కోట్ల 32 లక్షల రూపాయలు. ఈ డబ్బులు జారవిడిచింది ఎవరో కాదు.. చెక్‌ రిపబ్లిక్‌లో పాపులర్ అయిన ఓ టీవీ హోస్ట్, యాక్టర్, ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. అతని పేరు కమిల్ బార్టోషేక్.. అయితే అందరూ 'కజ్మా(Kazma)' అని పిలుస్తారు. చెక్‌ రిపబ్లిక్‌లో కజ్మాగానే అతను ఫేమస్‌.

publive-image కజ్మా

అసలు మ్యాటరేంటంటే?
కజ్మా ఇలా నోట్ల కట్టలు వదలడానికి ఓ కారణం ఉంది. కజ్మా ఇటీవలే ఓ పోటీ పెట్టాడు. వన్‌మాన్‌షో: ది మూవీ'లోని ఓ కోడ్‌ని డీకోడ్‌ చేయాలని గేమ్‌ పెట్టాడు. అయితే ఎవరూ కూడా ఈ చిక్కును పరిష్కరించలేకపోయారు. ఈ పోటీలో గెలిచిన వారికి రూ.8 కోట్ల రూపాయల ఫ్రైజ్‌ మనీ ఇవ్వాలని కజ్మా అనుకున్నాడు. కానీ ఎవరూ గెలవకపోవడంతో ఈ మనీని అందరికి పంచాలని డిసైడ్ అయ్యాడు. ఓ టైమ్‌ సెట్ చేశాడు. ఆ టైమ్‌కి అందరూ ఆ ప్రాంతానికి రావాలని చెప్పాడు. హెలికాఫ్టర్‌లో వచ్చి నోట్ల కట్టల వదులుతానని ముందుగానే చెప్పడంతో చాలా మంది బ్యాగులు పట్టుకోని వచ్చారు. అయితే మరికొందరు మరింత తెలివి ఉపయోగించారు. హ్యాండ్‌తో డబ్బులు కలెక్ట్ చేసుకుంటే కొంచెమే వస్తుందని గొడుగులు పట్టుకొచ్చారు. ఎందుకంటే గొడుకు ఒకేసారి ఎక్కువ డబ్బులను తన బుట్టలో వేసుకోగలదు కదా. అందుకే ప్లాన్‌ అమలు చేసి అందిన నోట్లను పట్టుకుపోయారు. మొత్తం 4 వేలకు మందికిపైగా ఈ పోటిలో పాల్గొన్నట్లు సమాచారం. నిజానికి ఇంతమంది గ్రూప్‌గా చేరి నోట్ల కట్టల కోసం ఎగబడితే ఏ తొక్కిసలాటో జరగాలి.. కానీ అక్కడ ఒక్కరికి కూడా గాయం కాలేదు. అదే డిసిప్లీన్‌ అంటే. అయితే ఇక్కడ కూడా ఓ ట్విస్ట్‌తో పాటు మంచి విషయం దాగుంది. ఈ నోట్ల కట్టలు మంచి పనులకు ఉపయోగించవచ్చు. ప్రతి నోటుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌కు లింక్‌తో ఓ క్యూఆర్(QR) కోడ్‌ను అమర్చారు. ఆ కోడ్‌ను స్కాన్‌ చేసి విజేతలు స్వచ్ఛంద సంస్థలకు డబ్బును విరాళంగా అందించవచ్చు.

Also Read: మ్యాచ్‌ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్‌ బ్రో?

#money-rain
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe