తెలంగాణలో 'విటమిన్‌-ఎమ్‌' హవా

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి తెలంగాణలో విటమిన్‌-ఎమ్‌ హవా నడుస్తోంది. విటమిన్‌-ఎమ్‌ అంటే.. ఎన్నికల వేళ తెలంగాణలో కరెన్సీ నోట్లకు సంబంధించి తెరపైకి వచ్చిన కొత్త పేరు ఇది.

Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!
New Update

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి తెలంగాణలో విటమిన్‌-ఎమ్‌ హవా నడుస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకొచ్చినప్పటి నుంచి పోలీసుల తనిఖీల్లో భారీగా విటమిన్‌-ఎమ్‌ పట్టుబడుతోంది. ఎమ్ ఫర్ మనీ అన్నది ప్రస్తుతం దేశం మొత్తం ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే విటమిన్-ఎమ్‌ అంటే.. ఎన్నికల వేళ తెలంగాణలో కరెన్సీ నోట్లకు సంబంధించి తెరపైకి వచ్చిన కొత్త పేరు ఇది. ఈ పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కరెన్సీ లేనిదే ప్రచారం నడవదు అన్న సంగతి తెలిసిందే. మనీ అనేది ఎన్నికల సమయంలో నాయకులకు ఒక విటమిన్ లా పనిచేస్తుంది. కార్యకర్తలకు టిఫిన్లు, టీలు, మందు, బిర్యానీ ఇలా ప్రతి ఒక్కదానికీ భారీగా ఖర్చుచేయాల్సిందే. అలాగే ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా భారీ స్థాయిలోనే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా విటమిన్‌-ఎమ్‌పై దృష్టి సారించారు. ఎక్కడైనా విటమిన్‌-ఎమ్‌ డంపులు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్‌ డయల్‌ చేసి సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe