Sun: భూమి మండుతోంది..చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. కారణాలేంటో తెలుసా..?

ఎన్నడూలేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జులై 3న ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 17.01 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా.. జులై 4న 17.18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం.

New Update
Sun: భూమి మండుతోంది..చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.. కారణాలేంటో తెలుసా..?

భూమి వేడెక్కుతోంది..చరిత్ర ఎన్నడూ చూడని విధంగా మండిపోతోంది. యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు లెక్కించడం మొదలు పెట్టిన తర్వాత ఎన్నడూ రికార్డవని ఉష్షోగ్రతలు నమోదయ్యాయి. ముందుగా జులై 3న భూమి సగటు ఉష్ణోగ్రత రికార్డు సృష్టితే..ఆ రికార్డు జులై4న చెరిగిపోయింది. జులై 3న ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 17.01 డిగ్రీల సెల్సియస్‌ (62.6 డిగ్రీల ఫారన్‌హీట్‌)గా ఉండగా.. జులై 4న 17.18 డిగ్రీల సెల్సియస్‌గా (62.9 డిగ్రీల ఫారన్‌హీట్‌) నమోదైంది. అంటే అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు ఒక్క రోజులోనే బ్రేక్ అయ్యింది. గతంలో ఎప్పుడు కూడా భూమి సగటు ఉష్ణోగ్రత 17డిగ్రీల సెల్సియస్‌కు టచ్‌ అవ్వలేదు. అలాంటిది వరుసగా రెండు రోజులు ఆ మార్క్‌ను దాటడం పట్ల ఆందోళన కలగిస్తోంది.

ఎందుకిలా జరుగుతోంది..:
భూమి వేడక్కడమన్నది చిన్నవిషయం కాదు. ఒక్క డిగ్రీ సెల్సియస్‌ పెరిగితేనే అనేక వినాశనాలు తప్పవు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. వరదలు, తుపానులు, టైఫున్లు, భూకంపాలు..ఇలా నిత్యం ఏదో ఒక చోటా..ఏదో ఒక రూపంలో ప్రకృతి వికృతి రూపం దాల్చుతూనే ఉంది. వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి పరిస్థితులు దాపరించాయని ఎన్నో ఏళ్లుగా పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నా.. ప్రపంచదేశాలు కంటితుడుపు చర్యలకే పరమితిమవతున్నాయని కానీ సమస్యపై లోతుగా దృష్టి పెట్టిన పాపాన పోలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌ వార్మింగ్‌ పట్టిపీడిస్తోంది.

publive-image పెరిగిపోతున్న సముద్రమట్టాలు( ఫైల్)

గ్లోబల్ వార్మింగ్‌తో అంతా అనర్థాలే:
వాతావరణం లోని కార్బన్ డయాక్సైడ్ (CO2) సూర్యరశ్మి వేడిని అధికం చేస్తుందని స్వీడన్ భౌతిక, రసాయన శాస్తవ్రేత్త స్పాంట్ అరెనియస్ 1896లోనే కనిపెట్టాడు. సూర్యరశ్మి మరీ వేడిగా మారి భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. డీజిల్, పొగ లాంటివి సీవో2 స్థాయిలను పెంచుతాయి. సీవో2 పరిమాణం రెట్టింపు అయితే ప్రపంచం ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెట్లు నరికివేయడం వల్ల ప్రధానంగా గ్లోబల్ వార్మ్‌(భూమి వేడి)అవుతుంది. అటు రిఫ్రిజిరేటర్స్ నుంచి వెలువడే SF6, HFC (Hexa Fluoro Corbons)లతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. భూమి ఎక్కువగా వేడెక్కడానికి కారణమయ్యే గ్యాసెస్‌లో ఇవి కూడా ఒకటి.

ఇలానే కొనసాగితే పెను విపత్తులు తప్పవు:
గ్లోబల్ వార్మింగ్‌తో మంచు కరిగి సముద్రమట్టం పెరుగుతుంది.. అందుకే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. అటు వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోవడం ప్రతి ఎండాకాలంలో మనం చూస్తున్నే ఉన్నాం. అటు వర్షపు చినుకులు మధ్యలోనే ఆవిరి కావడం వల్ల సరస్సులు, నదులు ఎండిపోతాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే వర్షం పడుతుంది. అప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి.. ప్రజలు ఆకలితో చనిపోతారు. మరోవైపు ప్రపంచంపై ఆధిపత్యం కోసం నిత్యం వెంపర్లాడే దేశాలే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువుల్లో అమెరికా నుంచి విడుదలయ్యేవి 25 శాతంగా ఉండడం చూస్తే ఆ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అటు కర్బన్‌ ఉద్గారాలను భారీ సంఖ్యలో విడుదల చేస్తున్న దేశాల్లో అమెరికా చైనా తర్వాతి స్థానంలో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు