Mohan Babu: విష్ణు పరిస్థితిపై తండ్రి మోహన్‌ బాబు ఎమోషనల్ ట్వీట్..!

కన్నప్ప షూటింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడిన విషయం తెలిసిందే. విష్ణు హెల్త్‌ అప్‌డేట్‌ గురించి అతడి తండ్రి మోహన్‌ బాబు ట్వీట్‌ చేశాడు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడని తెలిపారు. త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాడని ట్వీట్‌ చేశాడు.

New Update
Mohan Babu: విష్ణు పరిస్థితిపై తండ్రి మోహన్‌ బాబు ఎమోషనల్ ట్వీట్..!

Mohan Babu:  టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్‌ సహా పలువురు స్టార్‌ హీరోలు నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. అయితే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడిన విషయం తెలిసిందే.

publive-image

Also Read:ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. వ్యూహం సినిమాకు నో పర్మీషన్..!

సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను డ్రోన్‌ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్‌ విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ క్యాన్సిల్‌ అవగా మంచు విష్ణు చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడి తండ్రి మోహన్‌ బాబు.. మంచు విష్ణు హెల్త్‌ అప్‌డేట్‌ గురించి ట్వీట్‌ చేశాడు. 'కన్నప్ప షూటింగ్‌లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, మద్దతుకు ధన్యవాదాలు. భగవంతుడి దయతో అతడు కోలుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటాడు' అని ట్వీట్‌ చేశాడు.


కన్నప్ప మూవీ తన డ్రీమ్ ప్రాజెక్టు అని విష్ణు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మారు హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న విష్ణు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ హీరో శివకుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు.

publive-image

స్మాల్ స్క్రీన్ పై మహాభారతం సీరియల్‌ తీసిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ కన్నప్ప సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శివ భ‌క్తుడైన క‌న్న‌ప్ప క‌థ‌ను ఆధారంగా తీసుకుని తెర‌కెక్కుతున్న ఈ మూవీలో, మంచు విష్ణు క‌న్న‌ప్ప‌గా క‌నిపించ‌నున్నాడు.

Advertisment
తాజా కథనాలు