Shami: టీమిండియా పేసర్‌ షమీకి అర్జున అవార్డు.. ప్రకటించిన కేంద్రం!

వరల్డ్‌కప్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన టీమిండియా స్టార్‌ షమీకి కేంద్ర గుర్తింపు దక్కింది. అతనికి అర్జున అవార్డు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. హార్దిక్ గాయంతో WCకు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు.

New Update
Shami: టీమిండియా పేసర్‌ షమీకి అర్జున అవార్డు.. ప్రకటించిన కేంద్రం!

టీమ్ఇండియా పేస్ కెరటం మహ్మద్‌ షమీ(Mohammed Shami)ని దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు వరించింది. బీసీసీఐ షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ లో పెను సంచలనాలు నమోదు చేసిన షమీ తన అద్భుత బౌలింగ్‎తో అందరినీ కట్టిపయగా.. షమీకి అర్జున అవార్డును ఫిక్స్‌ చేస్తూ కేంద్ర ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు పలువురు క్రికెటర్లకు ఈ అవార్డు దక్కింది. 2021లో టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ (2013), రోహిత్‌ శర్మ (2015), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2014), రవీంద్ర జడేజా (2019) కూడా గతంలో అర్జున అవార్డు గెలుచుకున్నారు.

ఔరా షమీ:

హార్దిక్ పాండ్య గాయంతో ప్రపంచకప్ కు దూరమవడంతో గ్రౌండ్ లో దిగిన షమీ మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించి 24 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన షమీ ఫైఫర్లతో అదరగొట్టాడు. ఫైఫర్లు(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) తియ్యడం ఇంత ఈజీనా అన్నట్లు సాగింది షమీ ప్రదర్శన. సెమీస్‌లో ఏకంగా 7వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బౌలింగ్‌ పిచ్‌లపై షమీ రాణించిన తీరు అందరిని కట్టిపడేసింది.

షమీ సహస్పూర్ అలీనగర్‌ గ్రామంలో పెరిగాడు . అతని తండ్రి తౌసిఫ్ అలీ ఓ రైతు. ఆయన కూడా ఫాస్ట్ బౌలర్. దీంతో చిన్నతనం నుంచే షమీకి కోచ్‌గా ఉన్నారు. తన సొంత డబ్బుతో షమీ కోసం తండ్రి పిచ్‌ని తయారు చేశారు. మొరాదాబాద్ క్లబ్‌లో షమీ తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో విమర్శకుల మూతి మూయించాడు.

Also Read: రోహిత్‌ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్‌ కోచ్!

WATCH:

Advertisment
తాజా కథనాలు