‘ధోనీని చూసి నేర్చుకోండి’.. రమీజ్ రాజాకు గడ్డిపెట్టిన పాక్ మాజీ పేసర్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దేశంలో క్రికెట్‌ను నాశనం చేస్తోందని మాజీ కెప్టెన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను మహమ్మద్ అమీర్ తప్పుబట్టారు. కెప్టెన్ బాబర్ విఫలమైతే బోర్ట్ ఫెయిల్ అయినట్లు కాదన్నారు. నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడంలో ధోనిని చూసి నేర్చుకోవాలన్నారు.

New Update
‘ధోనీని చూసి నేర్చుకోండి’.. రమీజ్ రాజాకు గడ్డిపెట్టిన పాక్ మాజీ పేసర్

2023 వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్థాన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంపై ఆ దేశ మాజీలతోపాటు పలువురు అసంహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ బాబర్‌ అజామ్‌తోపాటు పాక్ క్రికెట్ వ్యవస్థను టార్గెట్‌ చేస్తూ పలు అంశాలను లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా.. బాబర్ ఆజం ఒత్తిడిని సమర్థి్స్తూనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దేశంలో క్రికెట్‌ను నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పందించిన పాక్‌ మాజీ పేసర్ మహమ్మద్‌ అమీర్.. ఆటగాళ్లు విఫలమైతే పాక్ క్రికెట్ బోర్డ్ పై విమర్శలు చేయడం సరికాదని, ఒకదాంట్లో ఫెయిల్ అయినంత మాత్రానా వ్యవస్థలను తప్పుబట్టడం సరైనది కాదన్నారు. అలాగే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఇంగ్లాండ్‌ కెప్టెన్ జోస్ బట్లర్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్.. ‘ఒక సిస్టమ్ అంటే అసలు ఏమిటి. ఇదోక వాల్ అని మీరు భావిస్తున్నారా. పాక్ క్రికెట్‌ను నడిపించేందుకు ఐదారుగురు వ్యక్తులు బాధ్యతలు తీసుకుంటారు. అందులో కెప్టెన్‌ కూడా ఒకరు. అయితే మేము 1992లో ఇమ్రాన్‌ నాయకత్వంలో వరల్డ్ కప్‌ గెలిచాం. అప్పుడూ ఇదే సిస్టమ్.1999లోనూ ఫైనల్‌కు చేరాం. 2009లో టీ20 ప్రపంచకప్‌ సాధించాం. 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నాం. ఎప్పుడూ అదే వ్యవస్థ ఉంది. కానీ నిరంతరం వ్యక్తులు మాత్రమే మారుతుంటారు. గత నాలుగేళ్లుగా కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ అజామ్‌ తనకు కావాల్సిన విధంగా జట్టును తయారు చేసుకున్నాడు. కానీ ఈసారి విఫలమయ్యారు అని చెప్పాడు.

Also read : KCR సినిమాకు షాక్ ఇచ్చిన ఈసీ.. కారణమిదే!

ఈ క్రమంలోనే నిజంగా వ్యవస్థదే తప్పైతే జోస్ బట్లర్ ఇక్కడి వ్యవస్థలో భాగం కాదు కదా. ఇంగ్లాండ్‌ కూడా దారుణంగా విఫలమైంది. అయితే ఇంగ్లాండ్‌లో సిస్టమ్ లోనూ మార్పులు రావాల్సిందే అంటారా.. అంటూ తనదైన స్టైల్ లో పలు అంశాలను ప్రస్తావించాడు. ఇక 2015లో తమ జట్టును వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిపేందుకు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ తనదైన స్టైల్ లో బ్రాండ్ క్రికెట్‌ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. దానికోసం 25 మంది ఆటగాళ్లను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే అప్పుడు, ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఒక్కటేనా. అందుకే ఇలాంటి టోర్నమెంట్ లో కెప్టెన్‌ మైండ్‌సెట్‌ చాలా ఇంపార్టెంట్. కెప్టెన్‌ మానసిక స్థితి మారనంత వరకు బోర్ట్ కూడా ఏమీ చేయలేదన్నారు. అలాగే ప్రపంచమంతా ధోనీ ఇండియా క్రికెట్‌ను మార్చేశాడని చెబుతున్నాం. కానీ అతడు అక్కడి వ్యవస్థను మార్చలేదు. నాణ్యమైన క్రికెటర్లను మాత్రమే తయారు చేశారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ వంటి వారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు జడ్డూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ధోనీ అలాంటి జట్టును అందించారు అంటూ అమీర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమీర్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలావుంటే నవంబర్ 15న భారత్, న్యూజీలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Advertisment
తాజా కథనాలు