Modi In Himachal pradesh:పండుగలు, బర్త్‌డే.. ఇలా ఏ స్పెషల్ వచ్చినా ప్రధాని మోదీ తన మార్క్‌ను చూపిస్తుంటారు. ఏది సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా మోదీ స్టైలే డిఫరెంట్. మిగిలిన రాజకీయ నాయకులు ఫ్యామిలీతో గడుపుతారు. టూర్లు వెళ్తారు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. కానీ మోదీ మాత్రం చిన్నారులతో, జవాన్లతో స్పెషల్ డేస్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి కూడా అదే చేశారు. దీపావళిని మరోసారి జవాన్లతో కలిసి జరుపుకున్నారు.
మీతోనే జరుపుకుంటా:
దేశమంతా దీపావళి ఆనందంగా జరుపుకుంటుందంటే దానికి సరిహద్దుల్లో మన కోసం నిత్యం విధులు నిర్వహిస్తున్న ఆర్మీనే కారణం. వాళ్లు పండుగను త్యాగం చేస్తారు కాబట్టే ప్రజలు పండుగును సెలబ్రేట్ చేసుకొగలగుతున్నారు. ఈ విషయం మోదీకి తెలుసు. అందుకే ఆయన ప్రతీఏడాది జవాన్లతోనే ఫెస్టివల్‌ను చేసుకుంటారు. దీపావళి నాడు హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలోని జవాన్లతో మోదీ గడిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30-35 ఏళ్లలో తాను ఆర్మీ జవాన్లతోనే పండుగను జరుపుకుంటున్నానన్నారు మోదీ. పీఎం, సీఎం లాంటి పదవులు లేకున్నా ప్రతీఏడాది ఇలానే చేస్తానన్నారు. 'నేను దీపావళిని సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి భద్రతా దళాలతోనే జరుపుకుంటాను' అని చెప్పుకొచ్చారు.
మోదీ ఏం అన్నారంటే:
'కుటుంబం ఉన్న చోట మాత్రమే పండుగ జరుపుకుంటారని అంటారు, కానీ నేడు, మీరందరూ మీ కుటుంబాలకు దూరంగా ఉండి సరిహద్దుల వద్ద ఉన్నారు, ఇది మీ విధి పట్ల మీకున్న అంకితభావానికి నిదర్శనం' అని కొనియాడారు. భారత సైన్యం, భద్రతా దళాలు దేశ నిర్మాణానికి నిరంతరం తోడ్పడ్డాయని ప్రశంసించారు. తన వీర సైనికులు హిమాలయాలలా కదలకుండా సరిహద్దుల్లో నిలబడినంత కాలం దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. 2016లో దీపావళికి ఇప్పటి దీపావళికి మధ్య దేశ రక్షణ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని.. దేశీయ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలకు చేరిందన్నారు మోదీ. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం తనకు గుడితో సమానం అన్నారు మోదీ.
Also Read: రోహిత్ శర్మ దెబ్బకు కోహ్లీ ఫ్రెండ్ రికార్డు గల్లంతు.. సూపర్ ‘హిట్’మ్యాన్..!
WATCH: