నేడు తెలంగాణకు మోడీ..6,100కోట్ల విలువైన కానుక ఇవ్వనున్న ప్రధాని..!!

వరంగల్ లో ఈరోజు రూ.6100 కోట్ల విలువైన పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేటలో రూ.500 కోట్లకు పైగా రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ ఆధునిక తయారీ యూనిట్ అధునాతన వ్యాగన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది స్థానికంగా ఉపాధి కల్పనకు దోహదపడుతుంది.

New Update
నేడు తెలంగాణకు మోడీ..6,100కోట్ల విలువైన కానుక ఇవ్వనున్న ప్రధాని..!!

ఇవాళ వరంగల్ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు అంతా సిద్దమైంది. కాసేపట్ల మోడీ తెలంగాణకు విచ్చేయనున్నారు. ఉదయం 9.25గంటలకు హకీంపేట విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు పాల్గొంటారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న మోడీ..ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుంటారు.

pm modi

అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకుంటారు. మొదట భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ సభలో రూ.6100 కోట్ల విలువైన పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాజీపేటలో రూ.500 కోట్లకు పైగా రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని అధికారిక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.20గంటల తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో హకీంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రాజస్థాన్ బయలుదేరుతారు.

కాగా ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించడం ఇది మూడోసారి. అంతకుముందు జనవరి, ఏప్రిల్‌లో రాష్ట్రానికి వచ్చారు ప్రధాని. ప్రధాని మోడీ వరంగల్ పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్ వరంగల్ కమిషనర్ ,ఇతర పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రతా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఇన్ చార్జి పోలీసు ఉన్నతాధికారులను నియమించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ తెలిపారు. దీంతో పాటు మామునూరు, భద్రకాళి దేవాలయం, ఆర్ట్స్ కళాశాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లలో 3,500 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు ఆయన తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు