Modi: ప్రధాని మోదీ గుడ్‌ న్యూస్‌.. వారికి రూ.2 వేల కోట్ల నిధులు!

స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సహాయ నిధిని మోదీ ఇవాళ అందించనున్నారు. SHGలకు సబ్సిడీ వడ్డీ రేట్లపై రుణాలు ఇవ్వనున్నారు ఇక 1,000మంది మహిళలకు డ్రోన్‌ల‌ను అందించున్నారు. ఇక ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా మోదీ ఇవాళే ప్రారంభించనున్నారు.

Modi: ప్రధాని మోదీ గుడ్‌ న్యూస్‌.. వారికి రూ.2 వేల కోట్ల నిధులు!
New Update

PM Modi Sashakt Nari Viksit: ప్రధాని మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 'సశక్త్ నారీ - విక్షిత్' కార్యక్రమంలో పాల్గొననున్నారు. వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలను వీక్షించనున్నారు. దేశవ్యాప్తంగా 11 వేర్వేరు ప్రదేశాల నుంచి 'నమో డ్రోన్ దీదీ'లు ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 1,000 మందికి మోదీ డ్రోన్‌లను అందించనున్నారు. నమో డ్రోన్ దీదీ, లఖ్‌పతి దీదీ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఆర్థిక సాధికారత, ఆర్థిక స్వయంప్రతిపత్తిని పెంపొందించే కార్యక్రమాలు.

వారికి రూ.2వేల కోట్ల సాయం!
ఇవాళ్టి కార్యక్రమంలో దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మద్దతుతో విజయం సాధించిన వారిని మోదీ సత్కరిస్తారు. ఇతర స్వయం-సహాయక బృందాల SHG సభ్యుల అభ్యున్నతికి మద్దతునిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న లఖపతి దీదీలను కూడా మోదీ సత్కరిస్తారు. స్వయం సహాయక బృందాలకు సబ్సిడీ వడ్డీ రేట్లపై రుణాలు ఇవ్వనున్నారు. 8వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మోదీ పంపిణీ చేస్తారు. క్యాపిటలైజేషన్ సపోర్టు ఫండ్‌లో దాదాపు 2 వేల కోట్ల రూపాయలను ఎస్‌హెచ్‌జిలకు అందించనున్నారు మోదీ.

ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం:
ఇక ఇవాళ మధ్యాహ్నం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో మోదీ పర్యటిస్తారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను చూస్తారు. ఇక ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా మోదీ ఇవాళే ప్రారంభించనున్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. మోదీ గురుగ్రామ్ (హర్యానా) రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే పక్కనే ఉన్న సెక్టార్-84 గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

Also Read: సందడిగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. అండ్ ది ఆస్కార్ గోస్ టూ..

#narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe