PM Modi : పార్లమెంటు క్యాంటీన్‌లో తోటి ఎంపీలతో మోదీ లంచ్..రాగి లడ్డూలు తిన్న ప్రధాని..!!

ప్రధానమంత్రి మోదీ ఈరోజు పార్లమెంట్ క్యాంటీన్ లో తోటి ఎంపీలతో లంచ్ చేశారు. 8మంది ఎంపీలతో మోదీ భోజనం చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఎంపిలు క్యాంటీన్ లో శాకాహార భోజనం చేసినట్లు తెలిసింది. రాగి లడ్డూలు తిన్నట్లు సమాచారం.

New Update
PM Modi : పార్లమెంటు క్యాంటీన్‌లో తోటి ఎంపీలతో మోదీ లంచ్..రాగి లడ్డూలు తిన్న ప్రధాని..!!

PM Modi Lunch With MP's at Parliament canteen:  పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కు (Budget 2024) ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎంపీలు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, స్కాంలపై కేంద్రం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది.

ఈ సందర్భంగా శుక్రవారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు క్యాంటీన్ లో లంచ్ చేశారు. తోటి ఎంపీలతో కలిసి ఆయన భోజనం చేశారు.

publive-image

బీజేపీ ఎంపీలు హీనా గావిత్, ఎస్ ఫాంగ్నాక్ కొన్యాక్, జమయంగ్ సెరింగ్ నంగ్యాల్, ఎల్ మురుగన్, టీడీపీ ఎంపీ రామ్ మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు మోదీతో లంచ్ పాల్గొన్నారు.

PM Modi Lunch With MP's

పలు పార్టీలకు చెందిన 8 ఎంపీలను ప్రధాని మోదీతో లంచ్ కోసం పీఎం మోదీ ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ ఎంపీలకు మధ్యాహ్నం 2.30గంటలకు ఫోన్ లో ప్రధాని మోదీతో ఈ లంచ్ గురించి సమాచారం అందినట్లు తెలిసింది.

PM Modi Lunch With MP's

ఆ ఎంపీలతో ప్రధాని మోదీ చలో ఇప్పుడు మీరు ఓ పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉందని కామెడీగా పేర్కొన్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి మోదీ (PM Modi), ఆ ఎంపిలు క్యాంటీన్ లో శాకాహార భోజనం చేసినట్లు తెలిసింది. రాగి లడ్డూలు తిన్నట్లు సమాచారం.

PM Modi Lunch With MP's

ఇది కూడా చదవండి:  మేడారం భక్తులకు శుభవార్త చెప్పిన సీఎం..ఆ సదుపాయం కల్పించిన సర్కార్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు