PM Modi: మోదీకొత్త ఫ్రెండ్స్‌ని చూశారా..పీఎం ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడండి!

ప్రధాని మోదీ సరదాగా పిల్లలతో గడిపిన వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో మోదీ పిల్లలతో కలిసి సరదాగా కాయిన్‌ గేమ్‌ ఆడారు.

PM Modi:  మోదీకొత్త ఫ్రెండ్స్‌ని చూశారా..పీఎం ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చూడండి!
New Update

PM Modi: భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలియని వారు ఉండరు. ఆయనకు విదేశాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సాక్షాత్తు పక్క దేశాల ప్రధానులే ఎన్నో సార్లు , ఎన్నో సందర్భాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటామని కూడా తెలిపారు. మోదీ నిరాడంబరాతకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.

ఇక మోదీ కి చిన్న పిల్లలు అంటే ఎంత ప్రేమో ఇప్పటికే పలు సందర్భాల్లో చూశాం. ఆయన పర్యటనల్లో ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే ఆయన వెంటనే వారి వద్దకు వెళ్లి లాలిస్తారు. ఆయన ఒడిలో కూర్చుపెట్టుకుని మరీ ఊసులు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయనే చెప్పవచ్చు.

తాజాగా మోదీ (Narendra Modi) ఇద్దరు చిన్న పిల్లలతో ఆడుకుంటు సంతోషంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌ గా మారింది. బీజేపీ తన అధికారిక సోషల్‌ మీడియాలో వీడియోను షేర్‌ చేసింది .ఈ వీడియో లో ఇద్దరు చిన్నారులు అక్కా తమ్ముడు మోదీని కలవడానికి వచ్చారు. వారిని చూసిన మోదీ ఆయన కూడా చిన్నపిల్లవాడిలాగా మారి ఎంజాయ్‌ చేశారు. మరోసారి తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

ముందుగా వారిద్దరికీ ఆయన దీవెనలు అందించారు. తరువాత వారితో కలిసి లోకాన్ని మరిచిపోయి ఆడుకోవడం ప్రారంభించారు. చిన్నతనంలో రూపాయి బిళ్లతో ఆడిన ఆటను..ఇప్పుడు ప్రధాని ఆ ఇద్దరి చిన్నారులతో కలిసి ఆడారు. ముందుగా మోడీ కాయిన్‌ ని నుదిటి పై ఉంచి తల వెనుక భాగంలో కొట్టడంతో అది బయటకు వస్తుంది. ఇదే విధంగా మోదీ ఇద్దరు పిల్లల నుదిటి మీద కాయిన్‌ పెట్టి కొట్టినప్పుడు ఆయన పిల్లలు నవ్వుతూ కనిపించారు. ఆయన కాయిన్‌ ఆట ఆడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మోదీ వారితో ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతే కాకుండా మోదీ ఈ వీడియో కింద మై న్యూ యంగ్‌ ఫ్రెండ్స్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

This browser does not support the video element.

అంతేకాకుండా మోదీ అలా ఆడడం చూసిన వారంతా కూడా ఆయన మీద మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే మోదీలానే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు చిన్నతనాన్ని మళ్లీ గుర్తు చేసినందుకు ఆయనకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు.

Also read:  దీని అర్థం ఏమిటమ్మ దీపికా..దాంపత్య జీవితం పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

#pm-modi #childrens
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe