Rain alert: రెండు రోజులు కుమ్ముడే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలకు హైఅలర్ట్ ప్రకటించారు. మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేశారు. 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది.

New Update
Rain alert: రెండు రోజులు కుమ్ముడే.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Rains in Andhra pradesh and Telangana: వర్షం కురవడం లేదులే.. హ్యాపీగా బయట తిరుగుదాం అని అనుకుంటున్నారా..? ఆరుబయట బట్టలు ఆరేసుకుందాంలే అని థింక్‌ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయని వాతావరణశాఖ చెప్పింది. రెండు రోజుల కుమ్ముడుతో పాటు మరో మూడు రోజులు దంచుడు ఉంటుందట. అంటే మొత్తంగా ఐదు రోజుల పాటు వరుణుడు తనకి తోచినప్పుడల్లా ఎంట్రీ ఇచ్చి బీభత్సం సృష్టించనున్నాడు. రెండు తెలుగు రోజుల్లో రానున్న ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయి.

వాతావరణంలో మార్పుకు రాష్ట్రం మరోసారి సిద్ధమవుతోంది. మూడు రోజుల క్రితం వరుణుడు ప్రతాపం చూపించగా.. తర్వాత శాంతించాడు. మధ్యమధ్యలో కాసేపు మెరిపించినా నాన్‌స్టాప్‌గా మాత్రం వర్షం కురవలేదు. మరోసారి ఎడతెరిపి లేని వర్షాలకు రెడీ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ వాసులు తమ గొడుగులను అందుబాటులో ఉంచుకోవాలి. భారత వాతావరణ శాఖ (IMD) సమగ్ర వాతావరణ సూచనను జారీ చేసింది.

• సెప్టెంబర్ 12: కొన్ని చోట్ల వర్షం పడుతుంది:
తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల ఛాన్స్‌ లేనప్పటికీ.. నివాసితులు అప్రమత్తంగా ఉండాల్సిందే.

• సెప్టెంబర్ 13: మరింత చెదురుమదురు జల్లులు
కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణ వాసులు తమ నిర్దిష్ట ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఫాలో అవుతూ ఉండాలి. రెయిన్ కోట్‌ని వెంటే ఉంచుకోవడంచాలా అవసరం.

• సెప్టెంబర్ 14: జల్లులు కొనసాగుతాయి
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ ధోరణి అస్థిరమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని సూచిస్తుంది.

• సెప్టెంబర్ 15: కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో సంభవించవచ్చు. కాబట్టి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ALSO READ: చంద్రబాబుకు రిమాండ్‌ తీర్పు ఇచ్చిన జస్టిస్‌ హిమ బిందు గురించి ఈ విషయాలు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు