కొండంత ఎండనైనా భరించగలం గానీ..చిగురంత చినుకుని సహించలేమట.! అలాంటిది ప్రతిరోజు కుండపోత వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలు ఎండ చూసి ఎన్నాళ్ళయ్యింది.!? వానదేవుడు ఎందుకింత పగబట్టాడు అనుకున్నాడు సామాన్యుడు.
పూర్తిగా చదవండి..హమ్మయ్య.!..ఇక భారీ వర్షాల ముప్పు తప్పినట్టేనట…!?
చెరువులు నిండిపోయాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నగరాల్లోను,పట్టణాల్లోనూ రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.అయితే జనం బాధ వరుణుడు విన్నాడు. ఏపీ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, సౌత్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంద్రలో కేంద్రీకృతమై ఉందని..అమరావతి వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ,అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని ఏపీ వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని వెల్లడించింది.

Translate this News: