హమ్మయ్య.!..ఇక భారీ వర్షాల ముప్పు తప్పినట్టేనట...!? చెరువులు నిండిపోయాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నగరాల్లోను,పట్టణాల్లోనూ రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.అయితే జనం బాధ వరుణుడు విన్నాడు. ఏపీ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, సౌత్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంద్రలో కేంద్రీకృతమై ఉందని..అమరావతి వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ,అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని ఏపీ వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని వెల్లడించింది. By V. Sai Krishna 28 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ వాతావరణం New Update షేర్ చేయండి కొండంత ఎండనైనా భరించగలం గానీ..చిగురంత చినుకుని సహించలేమట.! అలాంటిది ప్రతిరోజు కుండపోత వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలు ఎండ చూసి ఎన్నాళ్ళయ్యింది.!? వానదేవుడు ఎందుకింత పగబట్టాడు అనుకున్నాడు సామాన్యుడు. చెరువులు నిండిపోయాయు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నగరాల్లోను,పట్టణాల్లోనూ రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.అయితే జనం బాధ వరుణుడు విన్నాడు. ఏపీ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, సౌత్ ఒడిశాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంద్రలో కేంద్రీకృతమై ఉందని..అమరావతి వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ,అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని ఏపీ వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది.రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉందని వెల్లడించింది. శని,ఆదివారాల్లో ఉత్తర కోస్తాంద్ర మరియు యానాం ప్రాంతాల్లోని ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ వెదర్ సెంటర్ అధికారులు. దక్షిణ కోస్తాంధ్రలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు శని, ఆదివారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. రాయలసీమలో కూడా రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో పడే ఛాన్స్ ఉందన్నారు. అలాగే పలు చోట్ల 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని ఏపీ వాతావరణ శాఖ వెదర్ రిపోర్ట్ ఇచ్చింది. #rain-drop మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి